Today Horoscope : జీవితంలో ఉన్నత స్థాయికి రావాలనుకునే వారు జనరల్‌గా ప్రతీ రోజు కష్టపడి పని చేస్తుంటారు. అలా పనులు చేసే క్రమంలోనే నిర్ణయాలను త్వరగా తీసేసుకుంటారు కూడా. కాగా, కొందరు మాత్రం తమ రాశి ఫలాలు, జాతికాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలా విజయాలు సాధిస్తుంటారు.
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న ప్రకారంగా ఫాలో అవుతుంటారు. ఆ ప్రకారమే ఈ రోజు అనగా జనవరి 8న శనివారం రాశి ఫలాలు, జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశుల వారు ఈ రోజు గొడవలు పెట్టుకుంటే అస్సలు మంచిది కాదు.
వృషభం రాశివారికి ఈ రోజున తమ తోటివారి నుంచి హెల్ప్ లభిస్తుంది. ఇతరుల ప్రోత్సాహంతో తమ పనుల్లో విజయం లభించడంతో పాటు శుభ సంకేతాలు అందుతుంటాయి. అయితే, అంతమాత్రం చేత అజాగ్రత్త మంచిది కాదు.
బంధు మిత్రులు, స్నేహితులతో జాగ్రత్తగానూ ఉండాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి వారు ఈ రోజు తాము చేయబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. ఓర్పు, సహనంతో ముందుకు సాగుతుండాలి. ఇతరుల విషయమై అనవసర రాద్ధాంతాల జోలికి వెళ్లకుండా తమ పనులు తాము చేసుకుంటే చాలా మంచిది.
మిథున రాశి వారు కీలకమైన విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహారం చేయాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి వారు చేయబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే, వాటిని చూసి భయపడకుండా ధైర్యంతో ముందు అడుగు వేస్తే విజయం సాధించొచ్చు. సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కానీ, వీరు ఇతరులతో గొడవలు మాత్రం పెట్టుకోకూడదు. అలా చేయడం వలన ఇబ్బందులు తలెత్తొచ్చు.