...

Anchor Suma : విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుమ.. రెస్టారెంట్ లో రోబో సర్వర్ తో ఆటలు..!

Anchor Suma : టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న లేడీ యాంకర్లలో సుమ ప్రథమ స్థానంలో ఉందని చెప్పటంలో సందేహం లేదు. సుమ ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారమౌతున్న పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఒకవైపు టీవీ షోలు, మరొకవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో నిత్యం బిజీగా ఉంటుంది. సుమ డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూస్తున్నారు అంటే ఆమెకి ఉన్న పాపులారిటీ గురించి మనకు అర్థమవుతుంది. సుమ ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా పలు సినిమాలలో కనిపించింది. అయితే ఇటీవల విడుదలైన జయమ్మ పంచాయతీ సినిమాలో మాత్రం ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో సుమ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

Anchor Suma
Anchor Suma

నిత్యం టీవీ షోలు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లతో బిజీగా ఉండే సుమ తన ఫ్యామిలీతో గడపటానికి కూడా తనకి టైం ఉండదు. అటువంటి సుమ అన్ని టీవి షో లకి, ఇంటర్వ్యులకి, ఈవెంట్లకి విరామం ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేయటానికి విదేశాలకు వెళ్ళింది. తన వెకేషన్ కి సంబందించిన అన్ని విషయాలను సుమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఈ వెకేషన్ లో సుమతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరు కనిపించడం లేదు. సుమ ప్రస్తుతం న్యూయార్క్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

న్యూయార్క్ లో ఒక రెస్టారెంట్ కి వెళ్లిన సుమ అక్కడ రోబో సర్వర్ ని చూసి తెగ ఆనంద పడుతోంది. రెస్టారెంట్ లో రోబోలు సర్వ్ చేస్తున్నాయి. వీటికి మాటలు కూడా వచ్చా అంటూ దానికి హాయ్ చెప్పింది. ఆ రోబో సర్వర్ వచ్చే సమయంలో సుమ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి రోబో సర్వర్లు ఇంట్లో ఉండటంతో కూడా అవసరం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also :Suma: సుమ పరువు మొత్తం తీసేసిన జోగి బ్రదర్స్.. ఆమెకు రాత్రి అంతా అదే పనంటూ కామెంట్స్!