Karthika Deepam Dec 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీపకి కార్తీక్ చారుశీల చెక్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ నన్ను నువ్వు ప్రతిరోజు డాక్టర్ బాబు అని పిలుస్తూనే ఉంటావు మరి నేను డాక్టర్ అన్న సంగతి మరిచిపోయావా అని అనడంతో మరి నాకు ఈ టెస్టులని ఎందుకు చేయిస్తున్నారు డాక్టర్ బాబు నేనేదో తొందర్లో పోయేదాని లాగా హడావిడి చేస్తున్నారు అని అంటూ అలా మాట్లాడకు దీప అనగా ఏదో మాట వరసకు అన్నాను అంటుంది దీప. అప్పుడు చారుశీల మాటవరసకు కూడా అలా అనకు దీప కార్తీక్ తట్టుకోలేడు అని అంటుంది. అప్పుడు దీప కార్తీక్ చారుశీలని చూసి మీరు నా కోసమే పుట్టారని అనిపిస్తోంది అనడంతో వెంటనే చారుశీల నేను అనుకున్నా పని ఇంత తొందరగా వర్క్ అవుట్ అవుతుందని అనుకోలేదు ఇది కూడా అంత నా మంచిదే అని అనుకుంటూ ఉంటుంది.

Karthika Deepam Dec 30 Today Episode
ఆ తర్వాత కార్తీక్ దీపకి కొన్ని టెస్టులు చేయించాలి తీసుకువెళ్తాను అని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది చారుశీల. మరొకవైపు సౌందర్య హిమ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు శౌర్య కనిపించడంతో హిమను చూసావా అని అడగగా లేదు నానమ్మ దాని గురించి ఒకసారి నన్ను అడగకు అని సీరియస్ అవుతుంది. ఇంతలోని హిమ అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్లావు హిమ అనగా అమ్మానాన్నల ఫోటోని తీసుకొని వెతుకుతూ వెళ్ళాను నానమ్మ ఎవరిని అడిగినా చూడలేదని చెబుతున్నారు అని అంటుంది. అప్పుడు హిమ మాటలు అబద్ధం అంటూ సౌర్య నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో సౌందర్య సీరియస్ అవుతుంది.
అప్పుడు సౌర్య అక్కడి నుంచి వెళ్ళగా హిమ బాధపడుతూ ఉండడంతో నువ్వేం బాధపడకు హిమ అని సౌందర్య ఓదరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత చారుశీల దీపకు టెస్టులు అన్నీ చేయించుకుని అక్కడికి రావడంతో ఇదిగో కార్తీక్ మందులు దీపకు క్రమం తప్పకుండా ఉపయోగించు ఒకసారి చూసుకో అనడంతో నువ్వు చూసావు కదా చాలు ఇలా మళ్లీ నేను ఎందుకు అని అంటాడు. నా కూడా ఇదే కావాలి మొగుడు పెళ్ళాం నన్ను గుడ్డిగా నమ్ముతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సరే అని కార్తీక్ వాళ్ళు బయల్దేరి అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు సౌందర్య హేమచంద్ర ఇంటికి వెళ్తుంది.
చెప్పండమ్మ ఏం కావాలి అనడంతో మీరు ఒక డాక్టర్ కదా అంటూ తన కోడలు కొడుకు గురించి జరిగిందని మొత్తం వివరించడంతో హేమచంద్ర ఆలోచనలో పడతాడు. ఇప్పుడు సౌందర్య కార్తీక్ దీపల ఫోటో చూపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు హేమచంద్ర ను ఎక్కడైనా చూసావా బాబు అని సౌందర్య అడగలేదు అని అబద్ధం చెబుతాడు. సరే అని సౌందర్య అక్కడి నుంచి వెళ్తుండగా ఒక నిమిషం మేడం కాఫీ తీసుకొని వస్తాను అని అంటాడు. ఇంతలోనే దీప ఫోన్ చేసి నేను డాక్టర్ బాబు మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పడంతో హేమచంద్ర షాక్ అవుతాడు. అప్పుడు సౌందర్య ఇంట్లో అమ్మ లేనట్టుంది నేను కాఫీ పెడతాను అని కిచెన్ లోకి వెళ్తుంది.
ఇంతలోనే సౌందర్య వాళ్ళ ఇంటి దగ్గరికి కార్తీక్ రావడంతో అది చూసిన ఇంద్రుడు ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఇల్లు తీసుకున్నారు ఎవరైనా చూస్తే ప్రమాదం అవుతుంది ఇకనుంచి వెళ్లిపోండి అని అంటాడు. అప్పుడు వాళ్లు హేమచంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లడంతో అప్పుడు హేమచంద్ర జరిగింది మొత్తం వివరించగా కార్తీక్ దీప షాక అవుతారు. ఇప్పటికైనా ఏమి మించిపోయింది లేదు కార్తీక్ మీరందరూ కలిసిపోండి అని హేమచంద్ర కలపడానికి ప్రయత్నించగా కార్తీక్ హేమచంద్రపై సీరియస్ అవుతాడు. ఇంతలోనే కార్తీక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఇంద్రుడు అక్కడికి వచ్చి పాప వాళ్ళు బయటే ఉన్నారు మీరు ఇక్కడే ఉండండి సార్ అని అంటాడు.
అప్పుడు సౌందర్య అక్కడికి రావడంతో కార్తీక్ దీప పక్కకు వెళ్లి దాక్కుంటారు. అప్పుడు దీప ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత దీప నిద్ర లేచి డాక్టర్ బాబు నేను యాక్సిడెంట్ లో పోయాను అని చెప్పండి మీరు వెళ్లిపోండి అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ దీప నేను చనిపోతాను కదా అని అనగా నాకు నిజం మొత్తం తెలుసు డాక్టర్ బాబు మీరు పోయేది మీ ప్రాణాలు కాదు నా ప్రాణాలే అని అనగా కార్తీక్ షాక్ అవుతాడు.