Nithya Menon : అందం, అభినయం ఎక్స్ పోజింగ్ చేయకుండా మంచి గుర్తింపు సాధించుకున్న నటి ఎవరంటే గుర్తుకు వచ్చే పేర్లలో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నిత్యా మీనన్.. తర్వాత చాలా సినిమాల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో నీత్యామీనన్ చాలా అరుదుగా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పాలి.
![Nithya menon : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యామీనన్, నిజమేంటి? shock-nithya-menon-is-going-to-be-a-mother-without-marriage-what-is-the-meaning-of-that-post](https://tufan9.com/wp-content/uploads/2022/10/shock-nithya-menon-is-going-to-be-a-mother-without-marriage-what-is-the-meaning-of-that-post-1.webp)
Nithya Menon : నిత్యమీనన్ గర్భవతి…
ఇప్పుడు నిత్యా మీనన్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. దానికి కారణం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు. ఇప్పటి వరకు నిత్యా మీనన్ కు పెళ్లి కాలేదన్న విషయం చాలా మందికి తెలిసిందే. కానీ ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టగా దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ పోస్టు చూిన వాళ్లంతా.. నిత్యా మీనన్ తల్లి కాబోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.
![Nithya menon : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యామీనన్, నిజమేంటి? shock-nithya-menon-is-going-to-be-a-mother-without-marriage-what-is-the-meaning-of-that-post](https://tufan9.com/wp-content/uploads/2022/10/shock-nithya-menon-is-going-to-be-a-mother-without-marriage-what-is-the-meaning-of-that-post.webp)
పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ఏంటంటూ మరి కొందరు అంటున్నారు. ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్, ఆ పక్కనే పాల పీక ఉన్న పిక్ ను నిత్యా మీనన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. దీనికి వండర్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు నిత్యామీనన్. ఇప్పుడు అదే పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.