Malli Nindu Jabili serial September 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి నిండు జాబిలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సత్య, మీరాని తీసుకుని పట్నం వస్తాడు నిన్ను మోసం చేసిన నీ జీవితాన్ని నాశనం చేసిన పట్నం బాబు ఆచూకీ తెలిసింది మీరా.. ఏమిటి సత్యా నువ్వు అనేది అవును మీరా నీకు పోస్ట్ ఆఫీస్ కి ఫోన్ చేసింది. పట్నం బాబుపై నాకు ఆ రోజే అనుమానం వచ్చింది అందుకే ఎంక్వయిరీ చేశాను ఆచూకీ తెలిసింది.
నిన్ను మల్లిని ఎందుకు ఇలా చేసావు అని నిలదీస్తాం.. అప్పుడు మీరా అప్పుడే నీకు అంత కోపం ఎక్కువ వద్దు అంటుంది ఆవేశంలో ఏదో ఒకటి చేస్తా అందరు పడుకున్నారా నేను తొందర పడను ఇక్కడ పరిస్థితులు బట్టి నా కోపం ఉంటుంది. మల్లి దగ్గరికి సత్య వచ్చి తీసుకొని వెళ్తాడు. అప్పుడు మల్లి ఇది వసుంధర గారి ఇల్లు ఇక్కడికి తీసుకొచ్చావు అంటుంది. 18 సంవత్సరాల నుంచి మీ అమ్మ నిరీక్షణకి నీ ఎదురు చూపుకి పరిష్కారం ఇక్కడ దొరక పోతుందని సత్య అంటాడు.
సత్య, మీరా, మల్లిని శరత్ చంద్ర ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. శరత్ చంద్ర మీరా అని పిలుస్తాడు… మల్లి మా అమ్మ మీకు తెలుసా అయ్యగారు మీకు ఇంతకు ముందు పరిచయం ఉందా అంటుంది. సత్య కోపంతో మల్లి అడుగుతుందిగా చెప్పండి. మీరు చేసిన తప్పు కి 18 సంవత్సరాలుగా తలదించుకుని బతుకుతుంది. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన సమాధానం చెప్పండి. శరత్ వాళ్ళ అమ్మ మీరా, మల్లి ఇక్కడినుంచి వెళ్లిపోండి అన్నీ వివరంగా నేను తర్వాత చెప్తాను వసుంధర చూసిందంటే పెద్ద గొడవ జరుగుతుంది. అంతలో వసుంధర అక్కడికి వస్తుంది. గొడవెందుకు అత్తయ్య గారు అంటుంది. ఏం జరుగుతుంది అత్తయ్య ఇంత అర్ధరాత్రి మల్లి ఇక్కడికి ఎందుకు ఉంది. అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ నా కంట పడకుండా పంపించాలి అనుకుంటున్నారు.
అదేమీ లేదమ్మా మళ్ళీ వాళ్ళ అమ్మ ఊరు నుంచి వచ్చారు వెళ్తూ వెళ్తూ మన ఇంటి దగ్గర ఆగారు.. లేదు మీరు మీ అబ్బాయి కలిసి ఏదో నిజం దాస్తున్నారు. వసుంధర మా వాళ్ళు నిజం చెప్పట్లేదు మీరైనా చెప్పండి అని సత్య అని అడుగుతుంది. సత్య, మల్లి బాబాయిని అని చెప్పాడు. మీరెందుకు వచ్చారా అని వసుంధర అంటుంది. అప్పుడు సత్య 18 సంవత్సరాల క్రితమే రావాల్సిందే వసుంధర గారు ఇప్పటికే ఆలస్యం అయింది ఇప్పుడైనా అన్యాయం జరిగితే సంతోషం.. అప్పుడు వసుంధర న్యాయమా ఎవరికి న్యాయం చేయాలి సత్య ఇప్పటికైనా నోరు తెరవండి శరత్ గారు 18 సంవత్సరాల క్రితం నేలకొండపల్లి వచ్చినప్పుడు మీరాని ప్రేమించానని వెంటపడి మోసం చేసి ఒక బిడ్డ కి తల్లిని చేయొచ్చా నని.. మల్లి అంటే మీరు మా నాన్న మా అమ్మ ని మోసం చేసింది మీరేనా ఊర్లో మా అమ్మని అందరూ తిట్టడానికి నేను తండ్రి లేకుండా పెరగడానికి కారణం మీరేనా.. అప్పుడు శరత్ చంద్ర నేను కావాలని అలా చేయలేదు మల్లి క్షమించవా.. నీవల్ల నేను తండ్రి ప్రేమను మాత్రమే కోల్పోయాను కానీ మా అమ్మ జీవితాన్ని కోల్పోయింది.
అందరి మాటలతో నరకం అనుభవించింది నాకు కాదు మా అమ్మ క్షమాపణ చెప్పండి… ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా అమ్మకు చెప్పండి. ఎందుకు ఇట్లా చేశారని నేను ఎప్పుడూ అడగను కానీ ఒక్కటి మాత్రం అడగాలనుకుంటున్నాను నిజంగా నన్ను మీరు ప్రేమించలేదా అప్పుడు మీరు నా మీద చూపించిన ప్రేమ, నాతో చెప్పిన మాటలన్నీ అంత అబద్దమా.. లేదు మీరా నేను నిజంగానే ప్రేమించాను… నీతో చెప్పిన మాటలు అని నా మనసులో నుంచి వచ్చినవి నీ చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను.
అప్పుడు వసుంధర అగ్నిసాక్షి నాకు చేసిన ప్రమాణం ఏమిటి.. నేలకొండపల్లి వెళ్ళినప్పుడు నుంచి నీలో వచ్చిన మార్పు కారణం ఈవిడ గారేనా.. నన్ను కూడా ప్రేమించే గా పెళ్లి చేసుకున్నారు మీ ప్రేమ నిజమని మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. నేలకొండపల్లి పోముందుకే మనకే మాలిని పుట్టింది కదా.. మాకు అన్యాయం చేయాలని మీకెలా అనిపించింది. అసలే పల్లెటూరు దానిలో నచ్చిందేమిటి నాలో నచ్చిందేమిటి? ఈ పల్లెటూరు వాళ్ళు ఎప్పుడు డబ్బున్న వాళ్ళకు ఏరా వేస్తారు ఇలాంటి బతుకు బతకడం కంటే చావడం మేలు అని ఎప్పుడు తెలుసుకుంటారో అని అంటుంది.
శరత్ చంద్ర, కోపంగా వసుంధర అంటూ చేయి ఎత్తుతాడు. మీరా గురించి ఇంకొక మాట అంటే చంపేస్తా నిన్ను.. అసలేం తెలుసు మీరా గురించి నీకు మీరా దేవత.. తనని ఏమన్నా అన్నావంటే కళ్ళు పోతాయి. అప్పుడు వసుంధర కోపంతో దేవత అంటే అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటుంది లైన మొగాన్ని వల్ల వేసుకోదు. ఇంకొక ఆడదాని జీవితం లోకి రావాలని వాళ్ళ జీవితం నాశనం చేయాలని అనుకోదు అప్పుడు చంద్ర నోర్ముయ్ అంటాడు. మీరా కు నా గురించి ఏమీ తెలియదు నాకు పెళ్లయింది కానీ బిడ్డ ఉంది కానీ విషయాలు ఏమి తనకు తెలియదు.
నువ్వు ఏమన్నా అనుకుంటే నన్ను మీరాను కాదు.. నువ్వు అన్నావ్ కదా మీరాలో ఏముంది నాలో ఏమీ లేదు అని ప్రేమ.. ప్రేమించే మనసు నీలా ప్రతి దాంట్లో అనుమానించడం తనకి తెలియదు ప్రేమను పంచడం మాత్రమే తెలుసు.. మాట్లాడే విధానాన్ని నడుచుకునే ప్రవర్తన నీకు మీరాకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్కసారి కాదు ఎన్నో సార్లు నీకు చెప్పి చూశాను అయినాక నువ్వు మారలేదు రోజు రోజు మనశాంతి లేకుండా పోయింది. ఈ జీవితం ఇంతే నా అనుకునే సమయంలో మీరా నాకు ప్రేమను పంచే దేవతలా కనిపించింది. మీరాతో ఉన్నన్ని రోజులు వేరే ప్రపంచం కనిపించలేదు.. మేరా తో జీవితం పంచాలి నిర్ణయం తీసుకున్నాను.. మీరా కి నువ్వు, మాలిని ఉన్నారని చెప్పడానికి నిర్ణయించుకున్నాను.
కానీ ఈ లోపల నువ్వు నేలకొండపల్లి వచ్చి మాలిని మీద ఒట్టు వేయించుకున్న అన్ని తీసుకొని వచ్చా.. మళ్లీ నేలకొండపల్లి వెళ్ళకూడదని నా చేత ఒట్టు వేయించుకొని నా జీవితం నుండి మీరాని దూరం చేశా..18ఏళ్లుగా మీరా ఒంటరి జీవితానికి పరోక్షంగా నువ్వే కారణం అయ్యా.. సుందర షూర్ షూర్ అంటే మీరు చేసిన తప్పుని పవిత్రమైన ప్రేమకావ్యం అనుకుంటున్నారా.. నేను తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది అని శరత్ చంద్ర అంటాడు అప్పుడు వసుంధర నీకు మనస్సాక్షి అనేది కూడా ఉందా. నిజంగా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే జీవితంలో ఇంకొక ఆడదాన్ని రానిచ్చేవారు కాదు.. వసుంధర మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా మీ ఇద్దరికీ పెళ్లి అయిందా అని వసుంధర అంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో ఇప్పటికే ఈ మల్లి నా కూతురు జీవితంలోకి రావాలి అనుకుంటుంది అరవింద్ కి దగ్గర రావాలి అనుకుంటుంది. అప్పుడు అమ్మ ఇప్పుడు కూతురు అని కోపంతో వసుంధర అంటుంది.
Read Also : Karthika Deepam: డాక్టర్ బాబుకి సేవలు చేస్తున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.