Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ని తులసికీ క్షమాపణ అడగమని చెబుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో నందు,లాస్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు లాస్య నందుతో ఈ మాటలు సామ్రాట్ నోట్లో నుంచి వచ్చినవి కాదు మనసులో నుంచి వచ్చిన మాటలు అని అనడంతో వెంటనే వాళ్ళు ఏమైపోతే మనకెందుకు వదిలేయ్ అని అనగా అప్పుడు తులసి పరిస్థితి తలచుకొని నవ్వుకుంటూ ఉంటుంది లాస్య. మరొకవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో చేసిన నువ్వు వెళ్లి తనకి క్షమాపణ చెప్పవా అని అడగగా ఫోన్ చేసి చెప్తాను బాబాయ్ అని అంటాడు సామ్రాట్.
ఆ తర్వాత అందరి ముందు అవమానించి ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో అని అనడంతో డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడుతాను బాబాయ్ అని అంటాడు సామ్రాట్. మరొకవైపు తులసి ఇంటికి కాలనీ వాళ్లు వచ్చి ఈ సంవత్సరం బతుకమ్మను కాలనీ అందరూ కలిసి జరుపుకుందాం అనుకుంటున్నాము రావాలి అని ఇన్వైట్ చేసి వెళ్తారు. అప్పుడు తులసి ఇంట్లో వాళ్లతో పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ప్రేమ్ ఈ ఆడవాళ్ళ వల్లే ఈ పండుగలు డిస్టర్బ్ అవుతాయి అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడు దివ్య అన్నయ్య నువ్వు వెళ్లి శృతి వదినకు చీర కొని పెట్టు లేదా వదినకు సారీ చెప్పు అని అనడంతో అప్పుడు శృతి ఆంటీ పక్కనే ఉంది కట్టి తప్పకుండా స్వారీ చెబుతాడు అని అనుకుంటూ ఉండగా వెంటనే ప్రేమ్ దివ్య వెళ్లి మీ వదిన రెడీఅవ్వమని చెప్పు బయటకు వెళ్లి చీర కొనుక్కుని వస్తాము అని అంటాడు. ఆ తర్వాత వారందరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు దివ్య తులసితో, హనీ ని కూడా పిలుస్తున్నావా మామ్ అని అనగా,తులసి మౌనంగా ఉంటుంది. అప్పుడు దివ్య, ఏదో మాట వరసకు అన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సామ్రాట్, తులసి ఇంటికి బయలుదేరుతాడు. ఇంట్లో అనసూయ కోపంగా ఉండగా పరంధామయ్య ఏమైంది అని అడుగుతాడు.
తర్వాత అక్కడ జరిగిన విషయాల గురించి పరంధామయ్య అనసూయ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు అనసూయ పరంధామయ్యలు ఏమీ లేదు అంటూ తులసి ముందు కవర్ చేస్తారు. మరొకవైపు సామ్రాట్ కార్లో వస్తూ నేను తులసి గారితో ఎలా మాట్లాడాలి జరిగిన విషయాన్ని ఎలా చెప్పాలి అని అనుకుంటూ నా భారం తీరిపోతుంది అని అనగానే ఇంతలోనే తులసి వాళ్ళ ఇళ్ళు వస్తుంది.
అప్పుడు సామ్రాట్ ని చూసినా అనసూయ తులసి కోసం ఎందుకు వస్తాడులే నా కోసమే ఉండుంటుంది అని అక్కడికి వెళుతుంది అనసూయ. అప్పుడు అనసూయ, సామ్రాట్ దగ్గరికి వెళ్లి నేను ఇప్పుడు మీ ఇంటికి వద్దామనుకున్నాను బాబు ఈ లోపు మీరు మా ఇంటికి వచ్చారు . ధన్యవాదాలు బాబు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది అనసూయ.
మా కుటుంబ క్షేమం కోసం ఇలా చేయక తప్పడం లేదు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు తెలియకూడదు అని చెప్పి నాకోసమే వచ్చావు కదా అని అనసూయ అనగా లేదండి నేను తులసి గారి కోసం వచ్చాను అని అంటాడు సామ్రాట్. ఎందుకు వచ్చావు తులసి ఇప్పుడు మీ దగ్గర పనిచేయడం లేదు కదా అని అనసూయ అడగగా అసలు విషయం చెప్పడానికి వచ్చాను అంటే ఈవిడ నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారేస్తారేమో అనుకోని మనసులు ఫైల్స్ కోసం వచ్చాను అనే అబద్ధం చెబుతాడు సామ్రాట్.
సరే అయితే నేను వెళ్లే తులసి దగ్గర ఉన్న ఫైల్స్ తీసుకుని వస్తాను అని అనసూయ లోపలికి వెళుతున్నప్పుడు అనసూయ కచ్చితంగా తులసి కోసం వచ్చాడు తులసిని ఎలా అయినా కనిపించకుండా చేయాలి అని సామ్రాట్ గారు వచ్చారు అని తులసికి చెప్పడంతో తులసి సంతోషపడుతూ ఉండగా నీకోసం కాదులే ఏదో ఫైల్స్ కోసం వచ్చారంట అని చెబుతోంది అనసూయ. అప్పుడు అనసూయ ఏంటో చెప్పిన వినిపించుకోకుండా ఆ ఫైల్స్ ని తీసుకొని బయటకు వస్తుంది తులసి. మీరు నిజంగానే ఈ ఫైల్ కోసం వచ్చారా ఈ ఫైల్ అంత ఇంపార్టెంట్ కాదు దానికోసం మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది తులసి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World