Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీపక్, తులసి ఇద్దరూ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో నందు, లాస్యలు తులసి ఇంటికి వస్తారు. అప్పుడు తులసి నీవల్లే సామ్రాట్ గారికి నందు ని మాజీ భర్త అన్న విషయం తెలిసింది అంటూ లాస్య నిందలు వేయగా విన్నతులసి ఈ మాటలు మీరు నమ్ముతున్నారా అని నందుని అడగడంతో నమ్ముతున్నాను అని అంటాడు నందు. అప్పుడు లాస్య కావాలనే తులసిని డ్యామేజింగా మాట్లాడుతూ సామ్రాట్ కి తనకు మధ్య ఏదో ఉంది అన్న విధంగా మాట్లాడుతుంది. అప్పుడు తెలిసి కోపంతో దండం పెట్టి స్వారీ అని చెబుతుంది.
ఆ తర్వాత తులసి వంట గదిలో పీట తీసుకొని వచ్చి దాని మీద నుంచుని నందు లాస్యలకు తగిన విధంగా తన స్టైల్లో బుద్ధి చెబుతుంది. తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నందు తులసిని తక్కువ చేసి మాట్లాడగా వెంటనే తులసి ఏమాత్రం తగ్గకుండా తన స్టైల్లో నందుకి బుద్ధి చెప్పడంతో ఇంట్లో అందరూ క్లాప్స్ కొడతారు. ఇక నందు లాస్యలకు ఆ ఇంట్లో అవమానం జరగడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు సామ్రాట్ జరిగిన విషయాలను పదే పదే తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలోనే వాళ్ళ బాబాయ్ అక్కడికి రావడంతో ఎందుకు బాబాయ్ వారందరూ ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఒక ఆవిడకు సాయం చేసే ఇంతలా అనుకుంటుందా అని అంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కూడా అదే విధంగా మాట్లాడడంతో సామ్రాట్ గట్టిగా కోపంగా అరిచి నాకు తులసి భాగస్వామి స్నేహితురాలు మాత్రమే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ప్రేమ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా శృతి అక్కడికి పాలు తీసుకుని వచ్చి తాగమని పక్కన పెట్టేసి వెళ్తుంది.. అప్పుడు వెంటనే ప్రేమ చేతికి ఇవ్వచ్చు కదా అని అనడంతో నీ మొఖానికి ఇదే ఎక్కువ అంటుంది శృతి. అల వారిద్దరూ కాసేపు ఫన్నీగా గొడవ పడతారు. ఇంతలోనే తులసి అక్కడికి రావడంతో ఏం జరిగింది అని అనగా నేనిచ్చిన పాలు తాగలేదు అంటూ శృతిలసి ముందు అడ్డంగా బుక్ చేస్తుంది. అప్పుడు ప్రేమ్ ఏం చేయలేక శృతి తెచ్చిన పాలు తాగుతాడు.
అయితే శృతి ఆ పాలలో ఉప్పు కలుపుతుంది. ప్రేమ్ కూడా ఆ ఉప్పు కలిపిన పాలను అలాగే తాగేస్తాడు. ఆ తర్వాత నందు జరిగిన విషయాలను తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే లాస్య అక్కడికి రావడంతో నందు లాస్యత తన విషయాలన్నీ పంచుకోగా లాస్య నందుకి ధైర్యం చెబుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో తులసి, సామ్రాట్ కి ఇవాల్టితో మీకు మాకు మధ్య ఉన్న వ్యాపార భాగస్వామ్యం బంధం తెగిపోయింది అని మెసేజ్ చేయడంతో సామ్రాట్ షాక్ అవుతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World