Sai Pallavi Trolls : టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై రియాక్ట్ అయ్యారు. సాయిపల్లవిపై వస్తున్న ట్రోల్స్‌ను గవర్నర్ తీవ్రంగా ఖండించారు. సాయికి పల్లవికి సపోర్టుగా నిలిచి ట్రోలర్ల గట్టి క్లాసు తీసుకున్నారు. తమిళ పత్రికల్లో సాయి పల్లవిపై వచ్చిన వార్తలు ఎంతో బాధించాయని అన్నారు గవర్నర్ తమిళిసై. ఇటీవలే నేచురల్ స్టార్ హీరో నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ మూవీలో సాయి పల్లవి పెర్ఫామెన్స్ అదరోహో అనిపించింది. తన నటన, అభినయంతో సాయిపల్లవి విమర్శకులను సైతం మెప్పించింది. సాయి పల్లవి డాన్స్, యాక్టింగ్ ఫిదా అయిపోవాల్సిందే.. అయితే ఈ మూవీలో సాయి పల్లవి దేవదాసి పాత్రలో నటించింది. తమిళనాట సాయిపల్లవి బాడీ షేమింగ్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె అందంగా లేదని, నల్లగా, పొట్టిగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయం తమిళనాట సంచలనం రేపింది. సాయిపల్లవికి సపోర్ట్ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాయి పల్లవికి సపోర్ట్ చేస్తూ తెలంగాణ గవర్నర్ తమిళసై అండగా నిలిచారు.
పొట్టిగా, నల్లగా, జుట్టుతో పుట్టడం మన తప్పేమీ కాదు..
సాయిపల్లవిని కొందరు బాడీ షేమింగ్ చేయడంపై తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు. తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ ప్రస్తావించారు. హీరోయిన్ సాయిపల్లవి బాడీ షేమింగ్ చేయడం తనను చాలా బాధించిందన్నారు. ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. గతంలోనూ తన రూపాన్ని గురించి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడేవారని, అనేక విధాలుగా ట్రోల్ చేసేవారని అన్నారు. అలాంటి మాటలు పడినవారికే ఆ బాధంటే ఏంటో తెలుస్తుందన్నారు. బాడీ షేమింగ్ చేస్తున్నారని తెలిసి అప్పట్లో తాను చాలా తీవ్రంగా బాధపడినట్టు చెప్పుకొచ్చారు. ప్రతిభతో, శ్రమతో అలాంటి వాటిని ఎదుర్కొన్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ఇలాంటి కామెంట్స్ చేసినా అసలే పట్టించుకోవద్దని అన్నారు. పొట్టిగా, నల్లగా, జుట్టుతో పుట్టడం మన తప్పేమీ కాదన్నారు. అందం అనేది మన చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుందన్నారు.
కాకి పిల్ల కాకికి ముద్దు అన్నారు. కాకి తన పిల్లను బంగారు పిల్లగానే భావిస్తుందేగానీ నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా అన్నారు. ఈ సమాజంలో మహిళలే ఎక్కువగా బాడీ షేమింగ్‌కు గురవుతున్నారని చెప్పారు. కానీ పురుషులకు ఇబ్బందులు ఎదురపడవన్నారు. 50 ఏళ్ల వయసులోనూ పురుషులను చూసేందుకు ఇష్టపడతారు.. కానీ, స్త్రీలను మాత్రం చూడలేరు.. మహిళల ఎదుగుదలకు ఈ సమాజం అడ్డుపడుతూనే ఉంటుంది.. పదేపదే బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉంటోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఒకప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
In a live TV interview today, highlighted on Body-Shaming & its impact on women.
No woman should be discriminated on basis of their appearances/looks, color complexion & other physical characteristics.@PMOIndia @HMOIndia @MoHFW_INDIA @PTTVOnlineNews @pibchennai @ANI pic.twitter.com/rsPMLKKc7Z
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 27, 2022
సాయి పల్లవిపై తమిళ ఛానల్‌తో మాట్లాడిన టీవీ క్లిప్స్ కూడా ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేశారు. మహిళలని బాడీ షేమింగ్ చేయొద్దని సూచించారు. మహిళలు అలాంటివి అస్సలు పట్టించుకోవద్దన్నారు. ఇలాంటి సమయాల్లోనే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలన్నారు. మహిళలు.. తమ ట్యాలెంట్‌తో, శ్రమతోపైకి ఎదగాలని, అదే విమర్శించిన వారికి తగిన గుణపాఠమని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ట్రోలింగ్ చేసేవారిపట్ల తీవ్రంగా ఖండించినందుకు గవర్నర్ తమిళిసైని అందరూ అభినందిస్తున్నారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world