Intinti Gruhalakshmi Oct 15 Today Episode : తెలుగు బుల్లీతెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్ చేసిన పనికి తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి బాధతో మాట్లాడుతూ నువ్వు నా కొడుకువి అనుకున్నాను భార్యకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకు కాదు ఆ నందగోపాల్ కొడుకువి అంటూ కోప్పడుతుంది తులసి. నీకోసం శృతి అంత చేస్తే నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి అబద్ధం చెప్పిందని తన మీద నింద వేస్తావా అంటూ ప్రేమ్ మీద మండిపడుతుంది.
శృతికీ కూడా నాకు పట్టాల్సిన గతే పట్టాలి అనుకుంటున్నావా అనగా వెంటనే ప్రేమ్ తప్పు అయిపోయింది అమ్మ నేను అంత దూరం ఆలోచించలేదు నన్ను క్షమించు అంటూ తులసీ కాల మీద పడతాడు. అప్పుడు తులసి నన్ను కాదు శృతిని అడుగు అని అనడంతో అప్పుడు ప్రేమ్ శృతి కాళ్ల మీద పడబోతుండగా హ్యాపీ అందులో నా తప్పు కూడా ఉంది నన్ను కూడా క్షమించు ప్రేమ్ అని అంటుంది. ఇప్పుడు తులసి అమ్మయ్య ఇద్దరు కలిసిపోయారు అని అనుకుంటుంది.
అప్పుడు అభి అంకితలను మీ మధ్య కూడా ఏమైనా ఉందా అని అడగగా లేదు అమ్మ అంటాడు అభి. ఆ తర్వాత తులసి ప్రేమ్ తో కోపంగా గట్టిగా కొట్టాను ప్రేమ్ సారీ అని అనగా వెంటనే పరంధామయ్య అది అలా చెబితే పోదు శృతి ముద్దు పెడితే పోతుంది అంత వెంటనే శ్రుతి ప్రేమ్ కి ముద్దు పెడుతుంది. అప్పుడు అభి, ప్రేమ్ జంటలకు మరొకసారి శోభనం జరిపించాలి అని అనుకుంటారు. ఆ తర్వాత తులసి శృతి అంకితల శోభనం గది తయారు చేస్తూ ఉంటుంది.
Intinti Gruhalakshmi అక్టోబర్ 15 ఎపిసోడ్ : శ్రుతి-అంకితకు మళ్లీ మొదటి రాత్రి.. శోభనం గదిలో రెచ్చిపోయారుగా..
పక్కనే ఉన్న దివ్య వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు అంకిత సృజన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ మాకు ఏదోలా ఉంది ఇప్పుడు ఇంకో శోభనం అవసరమా అని అనగా పెద్ద వాళ్ళు చెప్పింది వినాలి అని అంటుంది తులసి. అప్పుడు దివ్య వదినలను ఇద్దరినీ ఆటపట్టిస్తూ ఉంటుంది. మరోవైపు పరంధామయ్య అభి,ప్రేమ్ లను గుంజిలు తీపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఎందుకు అని అడిగిన చెప్పకుండా వారితో బలవంతంగా గుంజీలు తీయిస్తూ ఉంటాడు పరందామయ్య.
అప్పుడు అనసూయ వచ్చి పరంధామయ్యపై సెటైర్లు వేయడంతో అభిప్రేమలు నవ్వుతూ ఉంటారు. తులసి అక్కడికి వచ్చి మీరు ఇంకా తయారవ్వలేదా అని అడుగుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన దివ్య మా వదినలు చాలా హుషారుగా ఉన్నారు అని అంటుంది. ఆ తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. అప్పుడు అభి పాలు తీసుకువస్తూ ఉండగా అప్పుడు అభి ఏంటి అంకిత నాతో పాల గ్లాస్ తెప్పిస్తున్నావ్ అని అనగా నిన్ను అలా చూడాలని ఉంది అది అంటూ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు శృతి ప్రేమ్ లు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Read Also : Intinti Gruhalakshmi: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న శృతి.. ప్రేమ్ చెంప చెల్లుమనిపించిన తులసి.?
Tufan9 Telugu News And Updates Breaking News All over World