Pranitha Subhash : సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో అత్తారింటికి దారేది , బ్రహ్మోత్సవం, రభస వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.

ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇక 2021 కరోనా సమయంలో ప్రణీత వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లయిన కొన్ని నెలలకే ప్రణీత గర్భం దాల్చడంతో సినిమాలకు దూరమయింది.
Pranitha Subhash : ప్రణీత అందాల ఆరబోత..
అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక కొన్ని రోజుల క్రితం ప్రణీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ప్రణీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.
ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో ప్రణీత షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెళ్లికాకముందు ప్రణీత తన అందాలు ఆరబోస్తూ గ్లామర్ ఫోటోస్ తో రచ్చ చేసేది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫలితం తన కెరీర్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పాపకి జన్మనిచ్చిన తర్వాత కూడా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో బీచ్ ఒడ్డున బికినీ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Prabhas : కృష్ణంరాజు మరణం తర్వాత సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్…?