Nuvvu Nenu Prema Serial : వండిన వంటల్లో ఉప్పు, కారం కలిపిన కుంచల.. ప్లాన్ చేసి అను, పద్మావతిని బయటకి గెంటేసింది..!

Nuvvu Nenu Prema Serial Aug 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మురళి ఏదో ఒక సాకు చెప్పి ఫంక్షన్ నుండి తప్పించుకుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.ఇక కుచల పద్మావతి మరియు అను ని చూసి ఇల్లంతా వాళ్లదే అయినట్టు తిరుగుతున్నారు. ఎలాగైనా వాళ్లకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. అను అందరికీ జ్యూస్ ఇస్తుంటే తనని పిలిచి అందరికీ ఇస్తున్నావు మరి నాకు ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు అను మీరు ఇందాక వద్దు అన్నారు కదా అందుకే ఇవ్వట్లేదు అంటుంది.

Shanthadevi lashes out at Kuchala for humiliating Anu

ఇక కుచల జ్యూస్ తీసుకుని కావాలనే గ్లాస్ కింద పడేస్తుంది. ఇక దాన్ని క్లీన్ చేయమని చెప్తుంది. అప్పుడు ఆర్య అక్కడికి వచ్చి తను ఎందుకు క్లీన్ చేయాలి అమ్మ పని వాళ్లకు చెప్తాను అంటాడు. అప్పుడు కుచల ఈ డర్టీ గర్ల్ మీద నువ్వు ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావ్ ఏం పర్లేదు తనే క్లీన్ చేస్తుంది అంటుంది. ఇక అను ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే పద్మావతి అక్కడికి వచ్చే అక్క నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటుంది. ఇక విక్కీ వాళ్ళ నానమ్మ కూడా కుచల మీద అరుస్తుంది. ఇక మాయ వంటల దగ్గరికి వెళ్లి పద్మావతి మీద కోపంతో ఎలాగైనా వాటిని పాడు చేయాలి అనుకుంటుంది. ఇక కుచల అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు మాయ ఏం లేదండి ఊరికనే ఉన్నాను అంటుంది.

Advertisement
Shanthadevi lashes out at Kuchala for humiliating Anu

పర్లేదు చెప్పు అనగానే మాయ ఎలాగైనా పద్మావతి మీద పగ తీర్చుకోవాలి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియడం లేదు అంటుంది. అప్పుడు కుచల నాకు చెప్పు నేను చేస్తాను అంటుంది. ఇక మాయ వంటలు పాడు చేస్తే విక్కీ వాళ్ళ మీద అరుస్తాడు అంటుంది. అప్పుడు కుచల వంటలలో ఉప్పు, కారం చల్లుతుంది. ప్రేమ్ సింగ్ అక్కడికి వచ్చి మీరిద్దరూ ఏంటి ఇక్కడ ఉన్నారు అంటాడు. . అప్పుడు కుచల ఇక్కడ ఎవరూ లేరు ఏంటి వీటిలో ఏమైనా పడి ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటుంది. అప్పుడు ప్రేమ్ సింగ్ క్షమించండి మేడం నేను ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాను ఇప్పుడే ఐస్క్రీమ్ తీసుకొద్దామని బయటకి వెళ్ళాను అంటాడు. ఇక ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అంటాడు.

Nuvvu Nenu Prema Serial Aug 19 Today Episode : అనుపై విరుచుకుపడిన కుంచల.. అడ్డుకున్న శాంతాదేవి..

ఇక అరవింద మరియు వాళ్ళ నానమ్మ భోజనాలు సిద్ధమయ్యాయ వచ్చిన వాళ్లకి వడ్డించండి అంటారు. కుచల అక్కడికి వచ్చి ముందు మీరు చేసిన వంట టేస్ట్ చేయాలి కదా అంటుంది. అప్పుడు అరవింద పద్మావతి చేసిన వంటకి వంక పెట్టడం అవసరం లేదు తను చాలా టేస్టీగా చేస్తుంది అంటుంది. ఇక వాళ్ళ నానమ్మ కూడా అలానే అంటుంది. అప్పుడు కుచల అయినా ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి వంటలను టేస్ట్ చేస్తుంది. అసలు వీటిని ఎవరైనా వంటలు అంటారా వీటిలో ఉప్పు కారం ఎక్కువ అయ్యాయి అంటుంది. వీటిని ముందుగా గెస్ట్ లు తింటే మా మొహం మీద ఉమ్ముతారు అంటుంది.

Advertisement
Shanthadevi lashes out at Kuchala for humiliating Anu

కుచల నేను ఏమి కావాలని చెప్పట్లేదు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అంటుంది. అప్పుడు అరవింద మరియు వాళ్ళ నానమ్మ టేస్ట్ చేస్తారు. ఇక వాళ్లకు కూడా అలానే అనిపిస్తుంది. అప్పుడు పద్మావతి ఏదో పొరపాటు జరిగింది మేము ఇంటి నుండి తెచ్చినప్పుడు చాలా బాగానే ఉన్నాయి అంటుంది. అప్పుడు కుచల అంటే ఎవరు లేని సమయంలో నేనే ఉప్పు కారం వేశాన అంటుంది. ఇప్పుడు వచ్చిన గెస్ట్ లకు ఏం పెట్టాలి. ది గ్రేట్ విక్రమాదిత్య కనీసం భోజనం కూడా పెట్టలేదు అని అందరూ అనుకుంటారు అంటుంది.

అత్తయ్య వీళ్ళని ఇక్కడ నుండి పంపించండి మనం ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేద్దాం అంటుంది. ఏంటి ఇంకా ఇక్కడి నిల్చున్నారు బయటికి వెళ్ళండి అని సెక్యూరిటీని పిలుస్తుంది. అప్పుడు పద్మావతి మాకు నిజంగా ఏమీ తెలియదు మా పొరపాటును సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటుంది ప్లీజ్ మీకు దండం పెడతాను అంటూ కుచల నీ బ్రతిమలాడుతుంది. ఇక కుచల వెళతారా మెడపట్టి బయటకు పంపించాలా అంటుంది. ఇక రేపు ఏం జరగబోతుంది చూడాలి.

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : పద్మావతిని చూడగానే పరారైన మురళి.. ఎమోషనల్ అయిన అరవింద.. ఓదార్చిన పద్మావతి

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

2 months ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

2 months ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

2 months ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

2 months ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

2 months ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

2 months ago

This website uses cookies.