Nuvvu Nenu Prema Serial July 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి మరియు అను లు పూజ ముగించుకుని ఇంటికి వెళ్తారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం. పద్మావతి వాళ్ళ అత్త మీకోసం అన్నీ సిద్ధం చేశాను అమ్మి అంటుంది. నువ్వు మా మంచి అత్తవి అని పద్మావతి ఆమె బుగ్గలు పట్టుకుని గట్టిగా గిల్లుతుంది. ఇంతకీ మీకు మంచి భర్త రావాలని అని కోరుకున్నారా అని వాళ్ళ అత్త అనగానే అప్పుడు పద్మావతి నేనైతే అక్కకి శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని కోరుకున్నాను అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త వచ్చే సంవత్సరం కల్లా మీరు మీ భర్తలతో వ్రతం చేసుకోవాలి అంటుంది. అట్లే గాని నాకు బాగా ఆకలేస్తుంది నువ్వు కూడా రా అమ్మి అంటూ వాళ్ళ అక్కని పిలుస్తుంది. నేను అత్తకి ప్రసాదం పెట్టి వస్తాను నువ్వు వెళ్ళు అంటుంది అను.
ఇక అరవింద మరియు వాళ్ళ భర్త ని చూసి వాళ్ళ నానమ్మ ఈ సంతోషం ఎప్పటికి ఇలాగే ఉండాలి అంటుంది. వచ్చే ఏడాది కల్లా మీరు పండంటి బిడ్డను కనాలి అంటుంది. అప్పుడు కుంచల కృష్ణ నువ్వు వర్క్ అంటూ అటు ఇటు వెళ్తే అత్తయ్య గారి డ్రీమ్ ఫుల్ ఫీల్ అవ్వదు నువ్వు ఇక అరవింద దగ్గరే ఉండాలి అంటుంది. అప్పుడు కృష్ణ తన మనసులో నేను ఇక్కడే ఉంటే పద్మావతిని కలవడం కుదరదు. నేను పద్మావతి ని చూడకుండా ఉండలేను అనుకుంటాడు. అప్పుడు విక్కీ ఏంటి బావగారు మీ వర్క్ గురించి ఆలోచిస్తున్నారా అంటాడు. లేదు నేను రాణమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఇంత కాలం నేను రాలేదని బాధపడింది కదా? ఇప్పుడు తనని నేను ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అరవింద వాళ్ళ బాబాయ్ మీ మనసులు ఒకటే కాబట్టి ఈ మధ్య దూరం పెరిగిన ప్రేమ అలాగే ఉంది మీరు ఎప్పుడు అలాగే ఉండాలి అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ మీరు రావడం వల్ల మా ఇంటికి కల వచ్చింది అంటుంది. ఇక కుంచల మీరు ఎప్పటిలాగే రాకపోతే మా అరవింద కళ్ళలో వాటర్ ఫాల్స్ చూసేవాళ్లం అంటుంది. అప్పుడు కృష్ణ నిజంగా నేను రాకపోతే రాణమ్మ కళ్ళలో బాధను చూసి విక్కి నా కోసం వెతుక్కుంటూ వచ్చి రెండు తగిలించి నన్ను తీసుకు వచ్చేవాడు అంటాడు.
కృష్ణ అన్నట్టు అమ్మమ్మ గారు ఎన్నడు గుడి కి రానీ విక్కీ ఈరోజు వాళ్ళ అక్క తో గుడికి వచ్చి పూజ కూడా చేశాడు ఇక మీ సంతోషం ఫలించినట్లే అంటాడు. అప్పుడు అరవింద విక్కీకి పెళ్లి అయితేనే నానమ్మ సంతోషం ఫలిస్తుంది అంటుంది. అప్పుడు విక్కీ నానమ్మ నా పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు అంటాడు. మేము అనగానే ఇప్పుడు నీ పెళ్లి జరుగుతుందా ఏదో మా సంతోషం కోసం అంటున్నాం అది కూడా తప్పేనా అంటుంది. అయినా నీ కాబోయే అమ్మాయి ఎక్కడ ఉందో నీతో నుదుటిన ఎప్పుడు కుంకుమ పెట్టించుకుంటుందో ఆపై వాడికే తెలియాలి అంటుంది. అప్పుడు విక్కీ పద్మావతిని గుర్తు తెచ్చుకుంటాడు. బావగారిని నిల్చోబెట్టి ఇప్పుడు నా పెళ్లి టాపిక్ గురించి మాట్లాడడం అవసరమా అంటాడు విక్కీ. అప్పుడు కృష్ణ తను ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏమో అని మేటర్ డైవర్ట్ చేస్తున్నాడు అంటాడు. అందరూ నవ్వుకుంటూ ఇప్పుడు ఇల్లంతా నిండుగా ఉంది అంటుంది వాళ్ళ నానమ్మ.
కుంచల కానీ మా స్టమక్ లు చాలా ఖాళీగా ఉన్నాయి పొద్దుట నుండి ఏమీ తినలేదు కదా అంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన పదండి వెళ్దాం లేకపోతే ఇది మనల్ని తింటుంది అంటాడు. ఇక పద్మావతి భోజనాలు సిద్ధం చేస్తూ అత్త మురళి గారిని కూడా పిలువు అతను కూడ తింటాడు అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త అతను లేడు అనగానే అతను రాగానే నాకు చెప్పు నేను అతనికి వడ్డిస్తాను అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త మురళి గురించి ఆలోచిస్తూ తను చాలా మంచివాడు రాగానే మురళి గురించి అడుగుతుంది. అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని తన మనసులో అనుకుంటుంది. పొద్దుటి నుండి ఏమీ తినలేదు అనుకుంటూ పద్మావతి ఫాస్ట్ ఫాస్ట్ గా తింటుంది. అమ్మి ఎందుకు అలా తింటున్నావ్ మురళి గారు వస్తే ఏం పెట్టాలి అంటుంది వాళ్ల అత్త. అవును కదు నేను మురళి గారి గురించే మర్చిపోయాను అసలే తను ఆకలికి ఆగలేడు అంటుంది పద్మావతి. అప్పుడు వాళ్ళ అత్త మళ్లీ వచ్చిన కొద్ది రోజుల్లోనే మనలో కలిసి పోయాడు. అతను లేకపోయినా మనం అతని గురించి ఆలోచిస్తున్నాము కదా అమ్మి అంటుంది. అప్పుడు పద్మావతి మురళి గారు లాంటి మంచి మనిషి ఎక్కడ ఉండడు అంటుంది. వాళ్ల అత్త అనుతో వ్రతం అంతా బాగానే జరిగిందా ఈ తింగరి మధ్యలో ఏమైనా తిన్నదా అంటుంది.
అప్పుడు పద్మావతి అత్త నన్ను సరిగా తిననివ్వు అంటుంది. సరే తిన్న తర్వాత ఒకసారి మురళి కి కాల్ చేసి తను ఎప్పుడు వస్తాడో కనుక్కో అంటుంది. ఆర్య ఏంటి వంటలు గుమగుమలాడి పోతున్నాయి ఏంటి స్పెషల్ అంటాడు. అప్పుడు కృష్ణ ఏంటి రాణమ్మ ఇన్ని వంటలు ఎందుకు చేశావ్ అంటాడు. అప్పుడు విక్కీ అక్క బావ గారి కోసం ఇదంతా చేసింది ఎప్పుడైనా మన కోసం ఇన్ని వంటలు చేసిందా అక్కకి మనకంటే బావగారి మీదనే ఎక్కువ ప్రేమ ఉంది అంటాడు. అరవింద నాకు మీరన్న మా ఆయన అన్నా ఒకటే నేను అందర్నీ ఒకేలా ప్రేమిస్తాను అంటుంది. బావగారు కడుపునిండా తినాలని ఇవన్నీ చేశాను అంటుంది. సరే కానీ మమ్మల్ని పస్తులు ఉంచవు కదా అంటాడు విక్కీ అప్పుడు ఆర్య బావ గారు మీరే మమ్మల్ని కాపాడాలి అంటాడు. అరవింద నవ్వుకుంటూ తన చేతులతో అందరికీ వడ్డిస్తుంది. కుంచల నువ్వు కూడా కూర్చో అమ్మ అనగానే అతనికి నా చేతులతో వడ్డిస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది తరగని కుంచల వాళ్ళ ఆయన నువ్వు ఎప్పుడైనా ఇలా వడ్డించావా అంటాడు. మీరు కూడా కృష్ణ లాగా అప్పుడప్పుడు రండి నేను కూడా తినిపిస్తాను అంటుంది. ఇక అరవింద కృష్ణకి అన్ని రకాల వంటలు రుచి చూపిస్తుంది.
ఇక పద్మావతి మురళి గారు ఏంటి ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంది. అప్పుడు అరవింద మీరు తినండి నేను ఫోన్లో మాట్లాడుతాను అంటుంది. అప్పుడు కృష్ణ అది అంత ఇంపార్టెంట్ కాల్ కాదు నేను తర్వాత మాట్లాడుతాను లే అంటాడు. అయినా నువ్వు ఉపవాసం ఉండి నాకు పెడుతున్నావ్ ఏంటి ఉండు నేను నీకు తినిపిస్తాను అంటూ అరవిందని కూర్చోబెట్టి ఆమెకు తినిపిస్తాడు.పద్మావతి వాళ్ళ అత్త తన దగ్గరికి వచ్చి ఏంటి మురళికి కాల్ చేసావా అంటుంది. చేశాను అత్త కానీ తను లిఫ్ట్ చేయట్లేదు పనిలో ఉన్నాడేమో అంటుంది. ఈ సారి చేసినప్పుడు ఎప్పుడు వస్తాడో కనుక్కో అంటూ లోపలికి వెళుతుంది. ఇక కృష్ణ పద్మావతి గురించి ఆలోచిస్తూ కాల్ కట్ చేసినందుకు తన బాధ పడుతుందేమో ఎలాగైనా తనకి కాల్ చేసి మాట్లాడాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. పద్మావతి వాళ్ళ అక్క అమ్మి తాగడానికి పాలు తీసుకు రానా అంటుంది. ఏం వద్దు అక్క అంటుంది పద్మావతి.
అయినా అక్క ఈ పూజలన్నీ మనమే చేయాలా మగవారు కూడా చేయొచ్చు కదా మంచి భార్య రావాలని వాళ్ళకి కూడా ఉంటుంది కదా అయినా ఉపవాసం చేయడం ఎంత కష్టమో నేను తట్టుకోలేక పోయాను అక్క అంటుంది. నువ్వు చెప్పావు అని నేను ఎంతో నిష్టగా ఉపవాసం ఉన్నాను కానీ ఆ టెంపరోడు నాకు తెలియకుండా నీళ్లు తాపించి మొత్తం చెడగొట్టాడు అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క నీకు తెలియకుండా జరిగిపోయింది కదా మళ్లీ నువ్వు ఎందుకు తలుచుకుంటు ఉంటున్నావు అంటుంది. అక్క నేను ఎక్కడికైనా వెళితే నా ఫోన్లో సరిగా సిగ్నల్ కూడా ఉండదు.
కానీ ఆ టెంపరోడు మాత్రం నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. ఎలా వస్తాడు కూడా నాకు తెలియదు అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క మొదట్లో నువ్వు చెప్పాక నేను కూడా అలానే మొదట్లో నువ్వు అతని గురించి అలా చెప్పాక నేను కూడా తప్పుగా అనుకున్నాను కానీ నేను అతన్ని చూశాక ఆర్య గారు అతని గురించి చెప్పింది విన్నాక అతను చాలా మంచివాడు అనిపిస్తుంది. ఆర్య విక్కీతో పద్మావతి చీరలో చాలా చక్కగా కనిపించింది. ఇంట్లో వాళ్లందరికీ తనంటే మంచి ఒపీనియన్ ఉంది అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరగబోతుందో చూద్దాం.
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.