Niharika's husband Chaitanya Jonnalagadda gives clarity on acting debut in Tollywood
Niharika Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే వారు అవుతుంటే కొత్తగా వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలు అవుతున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన హీరో ఎవరైనా కొత్తగా కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు వారి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మొన్నటిదాకా వివాదాల్లో చిక్కుకున్న మెగా ఫ్యామిలీ కొత్త జంట అయిన నాగబాబు ముద్దుల కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
నిహారిక తో పెళ్లి తర్వాత ఆమె భర్త చైతన్య హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని లేదా ప్రొడ్యూసర్ గా అయిన సినిమాలు చేసే అవకాశం ఉందని పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఈ జంట మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. కానీ వీరిద్దరు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.
అయితే వీరిలో ఎవరు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే చైతన్య సినిమాల్లోకి వస్తున్నాడనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా ఈ విషయంపై చైతన్య స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి బిజినెస్ లో తను చాలా హ్యాపీగా ఉన్నానని తనకు యాక్టింగ్ అంటే నచ్చదని యాక్టర్ అవ్వడం ఇష్టం లేదని ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చైతన్యకు సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఇకనైనా ఈ రూమర్స్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి. ఇక ఈ విషయం గురించి స్పష్టత రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Read Also : Niharika Konidela : తల్లి కాబోతున్న నిహారిక.. మేం ముగ్గురం అంటున్న మెగా డాటర్..!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.