Woman success story: నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన వున్న ఉమా మహేశ్వరి తన కాళ్లపై తాను నిలబడాలనుకునే మనస్తత్వం కలది. చిన్నప్పటి నుంచి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంది. కానీ కుటుంబ పరిస్థితి అందుకు సిద్ధంగా లేకపోవడంతో అలాగే ఊరుకుంది ఈ క్రమంలో పెళ్లి, పిల్లలు ఇలా జీవితం సాగిపోతోంది. అయితే సుదీర్ఘ ఆలోచన అనంతరం జ్యూట్ బ్యాగుల తయారీపై ఉమా మహేశ్వరి దృష్టి పెట్టింది. పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేకపోవడం.. లాభాలు ఎక్కువ ఉండడంతో వెంటనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంది. జూట్ బ్యాగులు తయారు చేసి పట్టణాలు, నగరాలకు సరఫరా చేయడం ప్రారంభించింది. ఆదాయం ఎక్కువగా రావడంతో మరిన్ని తయారు చేయడం మొదలుపెట్టింది. తనతో పాటు మరి కొందరికి ఉపాధి కల్పిస్తూ… అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
అయితే ఆమె ప్రస్తుతం జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ కూడా ఇస్తోంది. అంతేనా గ్రీన్ మారో జ్యూట్ రా మెటీరియల్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి ముడి సరుకును కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం 12 మంది మహిళలు ఉమా మహేశ్వరితో కలిసి పని చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వీరు పని చేస్తుంటారు. దాదాపు 300 రూపాయల నుంచి 500ల వరకు సంపాదిస్తుంటారు. తాము అందించే బ్యాగులు నాణ్యమైనవి కావడంతో… ఆర్డర్లు ఇచ్చి మరీ తాయరు చేయించుకుంటున్నారని ఉమా మహేశ్వరి చెప్తోంది. అయితే అన్ని ఖర్చులు పోనూ నెలకు 35 వేల నుంచి 40 వరకు వస్తున్నాయి ఆనందంగా వివరిస్తోంది.