Murali mohan : సామ్, చైతన్య బంధంపై మురళీ మోహన్ కామెంట్లు.. చక్కగా ఉండేవారట!

Murali mohan : సమంత, నాగ చైతన్య విడాకులపై సీనియర్ నటుడు మురళీ మోహన్ లేటుగా స్పందించారు. చై, సామ్ లు చాలా అన్యోన్యంగా ఉండే వాళ్లని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు. అలాంటి వాళ్లు విడిపోయారనే వార్త విని షాక్ గురైనట్లు తెలిపారు. అయితే హైదారాబ్ లోని ఫైనాన్షియస్ డిస్ట్రిక్ లో తమకు అపార్ట్ మెంట్లు ఉన్నాయని.. ఆ అపార్ట్ మెంట్ భవనంపై తమ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మూడు ఇళ్లను నిర్మించుకున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. అందుతో ఒకటి ఆయనది కాగా, మరొకటి తన కుమారుడిదని, ఇంకొకటి తన సోదరుడిదని వివరించాడు. అయితే ఓ సారి వాళ్ల ఇళ్లు చూసేందుకు వచ్చిన చైతన్య తన ఇళ్లలో ఒకటి కావాలని అడిగారట. కానీ అది వాళ్ల కోసం నిర్మించుకోవడంతో మురళీ మోహన్ ఇవ్వనని చెప్పారట.

Advertisement

ఆ తర్వాత నాగార్జున ఫోన్ చేసి అడిగితే.. కాదనలేక ఇచ్చినట్లు మురళీ మోహన్ పేర్కొన్నారు. అయితే చైతన్యస సమంత చాలా బాగుండే వారని.. ఎప్పుడూ చిన్న గొడవ కూడా పడలేదని వివరించారు. అయితే తమ ఇంటి పని మనుషులు చెప్పేవరకు వాళ్లు విడిపోయినట్లు తెలియదని వివరించారు. ఒకవేళ ముందుగానే విషయం తెలిస్తే వారిద్దరితో తాను మాట్లాడే వాడినని అన్నారు.

Advertisement