Karthika Deepam: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.. దీపను వెతుక్కుంటూ వచ్చిన కార్తీక్..?

Mounitha is worried about Karthik's disappearance in todays karthika deepam serial episode
Mounitha is worried about Karthik's disappearance in todays karthika deepam serial episode

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కావాలనే దీపకు అబద్ధం చెప్పి వీధి చివరకు పంపిస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో ఇంద్రమ్మ అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్లావు అని అడగగా సౌర్య వాళ్ళ అమ్మని వెతకడానికి వెళ్లాను అని చెబుతుంది ఇంద్రమ్మ. అప్పుడు ఇంద్రుడు నాకు కనిపించింది మాట్లాడాను అని అనగా వెంటనే తన మీ అమ్మేనా అని ఇంద్రమ్మ అడగగా మా అమ్మ కాదు పిన్ని అని చెబుతుంది శౌర్య. అప్పుడు సూర్య మా అమ్మ నాన్నలు బతికే ఉన్నారని తెలిసింది పిన్ని ఆ మౌనిత వల్లే ఇదంతా నాకు తెలిసింది.

Advertisement

అంటూ మౌనిత పై కోపంతో రగిలిపోతూ ఉంటుంది శౌర్య. దాని అంతు చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌర్య. మరొకవైపు వారణాసి కార్తీకి గతం గుర్తుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు గతం మర్చిపోవడం ఏంటి డాక్టర్ బాబు మీకోసం అని అంటాడు. ఆ తర్వాత ఒకవేళ దీప నిజంగా నా భార్య నా అయితే నేను దీప విషయంలో చేయకూడని తప్పు చేశానా అని అనగా వెంటనే ఏంటి డాక్టర్ బాబు దీపమ్మ బతికే ఉందా.

Advertisement

వెంటనే కార్తీక్ అవును నా చుట్టూ తిరుగుతూ నేనే తన భర్తని అని చెబుతూనే ఉంది నేనే వినలేదు అని అనడంతో ఎంత పని చేశారు డాక్టర్ బాబు. పదేళ్ల నుంచి నిందలు మోస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు కార్తీక్ గుర్తుతెచ్చుకుంటూ వారణాసి నన్ను కాసేపు వదిలేసేయ్ వెళ్లిపో అని గట్టిగా అరవడంతో వారణాసి ఎక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప సందు చివరి వరకు వచ్చి కార్తీక్ గురించి వెతుకుతూ ఉండగా ఇంతలోనే కొందరు మనుషులు దీపను చంపడం కోసం వెనకాల నుంచి వస్తారు.

అప్పుడు వారణాసి దీపక్క అని అరిచేలోగా ఆ రౌడీలు వారణాసి పై దాడి చేసి అక్కడ నుంచి పరిగెడతారు. అది చూసి కార్తీక్ వారణాసి ఏమైంది వారణాసి లెయ్యి వారణాసి అని అంటూ ఉంటాడు. మరొకవైపు సోరియా కోపంతో మోనిత కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు మోనిత కనిపించడంతో రాయి తీసుకొని విసురుతుంది. ఆ రాయి వెళ్లి కార్తీక్ తలకు తగలడంతో, వెంటనే మోనిత ఏ ఆగవే అంటూ సౌర్యను తరుముతుంది.

Advertisement

అప్పుడు కార్తీక్ కి రాయి తగిలి తన గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు దీప అని గట్టిగా అరుస్తాడు. మరొకవైపు శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి మనం వెళ్లాం పదండి బాబాయ్ అంటూ ఒక జరిగింది మొత్తం వివరిస్తుంది. మరొకవైపు మోనిత, కావేరి,కార్తీక్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. కార్తీక్ ఎక్కడికి పోయాడు ఏమో అంటూ మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.

మరొకవైపు దీప జాతరలో కార్తీక్ గురించి వెతుకుతూ ఉండగా ఇంతలో వాళ్ళ డాక్టర్ అన్నయ్య కనిపించి ఎక్కడికి వెళ్లావు దీప అని అడగగా డాక్టర్ బాబు కోసం వెళ్లాను అన్నయ్య ఎక్కడ దొరకడం లేదు అనడంతో వారిద్దరూ కాసేపు మాట్లాడి అక్కడి నుంచి కార్తీక్ కోసం వెతుకుతూ వెళ్తారు. మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. గుర్తుతెచ్చుకున్నదా కార్తీక్ నీ పేరేంటి అని డాక్టర్ అడగగా నా పేరు కార్తీక్ ప్రేమకు కార్డియాలజిస్ట్ అని చెబుతాడు.

Advertisement

ఆ తర్వాత వారణాసి ఎలా ఉంది అని అడగడంతో డాక్టర్స్ క్రిటికల్ గా ఉంది రేపు పొద్దున డిశ్చార్జ్ చేస్తాము అని చెబుతారు. రేపటి ఎపిసోడ్ లో దీప దుర్గా వాళ్ళ డాక్టర్ అన్నయ్య కార్తీక్ బాబు కనిపించడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు దుర్గా ఆ మోనిత కూడా నిజంగా డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు దీపమ్మ అని అనడంతో నాకు నా డాక్టర్ బాబు కనిపించే వరకు మనసు కుదురుగా ఉండదు అంటూ కార్తీక్ ని వెతకడానికి వెళ్తూ ఉండగా ఇంతలోనే కార్తీక్ దీపం వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు ఇద్దరు అనుకోకుండా ఒకరికి ఒకరు తగులుకుంటారు.

Advertisement