Guppedantha Manasu serial September 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని జగతి కి నగలు ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసు,రిషి కోసం ఒక డ్రెస్ ని సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు రిషి అది బాగోలేదు అనడంతో వసుధార ఇంకొకటి సెలెక్ట్ చేస్తుంది. అది కూడా బాగా లేకపోయినా వసుధార బాగాలేదు అంటే బాధపడుతుంది అని బాగుంది అని చెబుతాడు. ఇంతలో గౌతం అక్కడికి వచ్చి ఏమీ బాగోలేదు అని అనగా రిషి,గౌతమ్ ని తిట్టి అక్కడి నుంచి పంపిస్తాడు.
ఆ తర్వాత ఫణీంద్ర, గౌతమ్ ఇద్దరు ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి రావడంతో వెంటనే ఫణీంద్ర ఏంటి రిషి నీ డ్రెస్ సెలక్షన్ బాగుంటుంది కదా మరి ఏంటి ఈ రోజు ఇలా ఉన్నావు అని అంటాడు. అప్పుడు వసుధార బాధపడుతుంది అని వెంటనే రిషి లేదు పెద్దనాన్న బాగానే ఉంది అని అంటాడు.
అప్పుడు వసుధర కూడా రిషి సార్ ఎప్పుడు ప్రిన్స్ లా కనిపిస్తారు కానీ ఈరోజు అలా కనిపించడం లేదు అదంతా నా వల్లే అని అనుకుంటుంది. ఇక ఇంతలోనే ఫణింద్ర కాఫీ తాగాలని ఉంది అని అనగా వసుధార తెస్తాను అని లోపలికి వెళుతుంది. మరొకవైపు పెళ్లి రోజు కారణంగా జగతి నగలు అన్ని ధరించి అందంగా ముస్తాబు అవుతుంది.
Guppedantha Manasu serial Sep 15 Today Episode : వసుధారని అలాగే చూస్తూ ఉండిపోయిన రిషి..?
ఇంతలో మహేంద్ర అక్కడికి అందంగా రెడీ అయి వచ్చి ఇద్దరూ ఒకరికొకరు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి సంతోషంగా కనిపిస్తారు. అప్పుడు కాసేపు గతంలో జరిగిన విషయాల గురించి ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు. ఇప్పటికీ ఇదంతా నాకు కలలాగే ఉంది అని జగతి అంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర,గౌతమ్ రిషి వాళ్ళు బయట మాట్లాడుతూ ఉండగా ఇంతలో వసు అక్కడికి కాఫీ తీసుకుని వస్తుంది.
అప్పుడు ఎలా అయినా ఆ షర్టు మార్పించాలి అని కావాలనే వసు రిషి పై కాపీని పోయాక రిషి షర్టు మార్చుకొని రావడానికి లోపలికి వెళ్తాడు. అప్పుడు మహేంద్ర రిషి ని చూసి హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు వసుధార చీర కట్టుకొని గతంలో రిషి అన్న మాటలు తలుచుకొని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి వసుధార వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు.