Devatha june 15 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రుక్మిణి కోసం దేవుడమ్మ ఉపవాస దీక్ష చేయాలి అని నిర్ణయించుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ, రుక్మిణి గురించి ఆలోచిస్తూ రుక్మిణి చనిపోయింది అనుకొని గోడకి ఫోటో వేసి దండ కూడా వేశాము. కానీ ఎవరు కూడా రుక్మిణి శవాన్ని చూడలేదు. ఇక పూజారి చెప్పిన మాటలను బట్టి చూస్తే రుక్మిని ఎక్కడో ఒకచోట బతికే ఉంది అని నేను బలంగా నమ్ముతున్నాను అని అంటుంది దేవుడమ్మ.

రుక్మిణి దొరికేవరకు నేను ఉపవాసం ఉంటాను అని అనడంతో వెంటనే ఈశ్వర్ ప్రసాద్ మరి నీ ఆరోగ్యం అని అనగా అప్పుడు దేవుడమ్మ మాత్రం దేవుడు చూపు తో పాటుగా మన వంతు ప్రయత్నం కూడా ఉండాలి అని అంటుంది. దేవుడమ్మ మాటలు విన్న సత్య అటువంటి పని చేయొద్దు అక్క కోసం అలాంటి నిర్ణయం తీసుకోకండి అని అనగా నువ్వేనా సత్య ఇలా మాట్లాడుతోంది అని చెప్పి ఎవరు ఏమనుకున్నా రుక్మిణి దొరికే వరకు నేను ఉపవాసం ఆపను నిద్ర పోను అని శపధం చేస్తుంది దేవుడమ్మ.
మరోవైపు రాధ, ఆదిత్య గురించి ఆలోచిస్తూ.. నేను ఈ ఇంట్లో ఎందుకు అంటున్నాను అని ఒక్క మాట కూడా అనలేదు. తొందర్లోనే ఈ ఇంటిని విడిచి బయటికి వెళ్తాను. దేవిని ఆదిత్యకు అప్పజెప్పి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి చీర బాగుంది అని చెప్పి ముద్దు పెడుతుంది. ఆ తర్వాత దేవి పిలవడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడు రాద, చిన్మయి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మరోవైపు దేవుడమ్మ అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఆపలేదు అని ఆదిత్య, సత్యను ప్రశ్నిస్తాడు. అక్కడ రుక్మిణి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసావు కదా అని చెబుతూ బాధపడుతుంటాడు. దేవి కి కాలు నొప్పి అనడంతో చిన్మయి ఈ కాళ్ళు నొక్కుతూ ఉండగా ఇంతలో రాధ అక్కడికి వచ్చి దేవి కోసం వేడి నీళ్ళు పెట్టడానికి వెళుతుంది.
అప్పుడు దేవి రాధ దగ్గరికి వెళ్లి పాపం కదా అమ్మ అక్కకు అమ్మ లేదు అని అనగా అలా ఏం లేదమ్మా నేను ఉన్నాను కదా అని అంటుంది రాద. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే చిన్మయి అడ్డుగా ఉంది అని బాధ పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మాధవ, దేవి తో మాట్లాడుతూ మీ అమ్మ కోపంగా ఉంది అని చెప్పి దేవి, రాధ ల మధ్య గొడవలు పెట్టడానికి కావాలనే కింద పడతాడు. అప్పుడు రాధ అక్కడికి రాకపోవడంతో దేవి మాధవ కు సేవలు చేస్తూ ఉంటుంది. మరొక వైపు భాష ఆదిత్య ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 14 today episode : రుక్మిణి కోసం దీక్ష మొదలుపెట్టిన దేవుడమ్మ.. షాక్ లో మాధవ..?