Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నందు వాళ్లు, తులసి వాళ్ళు అందరూ గుడికి వెళ్తారు.
లాస్య వాళ్ళు అక్కడికి రావడంతో తులసి కుటుంబం అందరూ వీళ్ళేందుకు వచ్చారు అన్న విధంగా చూస్తూ ఉంటారు. అనసూయ మాత్రం హాయ్ అని చెబుతుంది. అప్పుడు పరంధామయ్య ఎందుకే వాళ్లకు హాయ్ చెబుతున్నావ్ అని అనగా నందు కి మేనేజర్ పోస్ట్ వచ్చిందని నా పేరు మీద పూజ చేయించడానికి నేనే వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలిచాను అని అంటుంది. ఒకేసారి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు పరంధామయ్య.
అప్పుడు నందు వాళ్ళని పిలిచి లోపలికి పిలుచుకొని వెళ్తుంది అనసూయ. అప్పుడు లాస్య అనసూయ పరంధామయ్య ల పేరు మీద పూజ చేయిస్తుంది. ఆ తర్వాత పూజారి గారు ఈరోజు మంచి రోజు అమ్మవారికి ముడుపు కడితే నెరవేరుతుంది అని అనడంతో వెంటనే తులసి నాకేమీ కోరికలు లేవు పంతులుగారు మనవడు మనవరాలు పుడితే చాలు అని అంటుంది.
అప్పుడు శృతి ఎందుకు ఆంటీ ఇదంతా అని అనగా వెంటనే అనసూయ ఏం మీకు పిల్లలు వద్దా అని అడుగుతుంది. అప్పుడు దివ్య కూడా భోజనాలు వెళ్లి మా అన్నయ్యలతో ఆ ముడుపు కట్టండి నాకు కొంచెం కొత్తదనం కావాలి అని అంటుంది. ఆ తర్వాత పూజారి చెప్పిన విధంగా ప్రేమ్ అభి వారి భార్యలను ఎత్తుకొని ముడుపులు కట్టిస్తారు. ఇప్పుడు లాస్య తులసి వైపు చూస్తూ తప్పుగా అనుకుంటూ ఉంటుంది.
తర్వాత తులసి వాళ్ళందరూ కలిసి కాలనీ ఫంక్షన్ కి వెళ్తారు. సంతోషంతో బతుకమ్మ పండుగలో బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు హనీ చూసినా లాస్య ఏంటి అని ఒకటే వచ్చింది సామ్రాట్ రాలేదా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హనీ మంచినీళ్ల కోసం బయటకు వెళ్లగా అప్పుడు లాస్య కూడా హనీ దగ్గర వెళ్లి సామ్రాట్ గురించి ఆరా తీస్తూ ఉంటుంది.
అప్పుడు ఎందుకు రాలేదు అని అడగగా మా నాన్న ఏదో మీటింగ్ లో ఉన్నారంట ఆంటీ అని చెబుతుంది. అప్పుడు లాస్య ఎలా అయినా హనీ ని అడ్డుపెట్టుకుని సామ్రాట్ ని ఇక్కడికి రప్పించాలి అనుకుంటూ సామ్రాట్ వాళ్ళ కార్ డ్రైవర్ ఫోన్ తీసుకొని హనీకి కడుపునొప్పి అని అబద్ధం చెప్పిస్తుంది.
అప్పుడు హనీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగిందమ్మా అని అనటంతో హనీ కడుపు నొప్పిగా ఉంది డాడీ నువ్వు తొందరగా ఇక్కడికి రా అనడంతో వెంటనే వస్తున్నాను అని టెన్షన్ తో బయలుదేరుతాడు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కి అసలు విషయం చెప్పి అక్కడికి బయలుదేరుతాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నేను కూడా వస్తాను అని సామ్రాట్ తో బయలుదేరుతాడు.
మరొకవైపు తులసి వాళ్ళు బతుకమ్మ పండుగలో భాగంగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడు తులసి కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు సామ్రాట్ తులసి కి ఫోన్ చేస్తూ ఉండగా తులసి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సరికి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు నందు లాస్య కూడా ఆనందంగా గేమ్స్ ఆడుతూ ఉంటారు..
Tufan9 Telugu News And Updates Breaking News All over World