Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో చారుశీల కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో చారుశీల మాట్లాడుతూ నువ్వు ఎవరికోసం అయితే నిజం దాస్తున్నావో వాళ్లు ఎవరూ ఆనందంగా లేరు కార్తీక్ అని అనగా వెంటనే కార్తీక్ మరి ఏం చేయాలి ఆ నిజం నాలో నేను దాచుకుంటూ నేను ఎంత బాధ పడుతున్నానో నీకు తెలియదు అనడంతో అర్థమవుతుంది కార్తీక్ పరాయి దానే నిన్ను చూసి ఇంత బాధపడుతుంటే ప్రత్యక్షంగా ఆ బాధను అనుభవిస్తున్న నీకు ఎలా ఉంటుందో ఊహించగలను కానీ ఇలా మాత్రం ఉండకూడదు ఏదో ఒక పరిష్కారం ఆలోచించు అని అంటుంది. ఎలా ఆలోచించాలి అర్థం కావడం లేదు ఒక సమస్య తొలగించాలి అనుకుంటుంటే మరొక సమస్య వచ్చి పడుతోంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని కార్తీక్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు దీప బాధ పడుతూ ఉండగా పండరి ఓదారుస్తూ ఉంటుంది. ఏడవకు దీపమ్మ అనడంతో నాకు ఏడుపుగాక ఇంకా ఏం మిగిలింది పండరి చూసావు కదా ఆ ఇంద్రుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఏదో జరిగింది దీపమ్మ పొద్దున ఉన్న వాళ్ళు సాయంత్రానికి లేరు అంటే ఏదో జరగకూడదని జరిగింది అని అంటూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు దీప మేము ఎక్కడ ఉన్నామో వాళ్లకు బాగా తెలుసు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అని అంటుంది. అప్పుడు పండరీ సార్ కూడా వచ్చారు అని అంటుంది.
సారూ మీకు అన్నం రెడీ తీసి పెట్టాను ఇద్దరూ కలిసి తినండి దీపమ్మ టాబ్లెట్ వేసుకోలేదు మీరు వేయించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఎలా అయినా దీప మూడ్ ని చేంజ్ చేయాలి అనుకున్న కార్తిక్ నవ్వుతూ మాట్లాడిన కూడా దీప అలాగే బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా అయితే కాదు దీపక్ ఎలా అయినా నిజం చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య హాస్పిటల్ లో జరిగిన విషయాలు తలుచుకుని సౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలా అయితే కాదు శౌర్య దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి అంజి రావడంతో తొందరగా కారు తీయి అంజి మనం ఒక చోటికి వెళ్లాలి అని అంటుంది.
మరొకవైపు దీప కార్తిక్ ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఉండగా కార్తీక్ దీపకి ధైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు దీప సౌర్య గురించి బాధపడుతూ ఉండగా అప్పుడు కార్తీక్ పండరీ చెప్పింది విన్నావు కదా దీప ఆ ఇంద్రుడు వాళ్ళు మన బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అందుకే మనకు ఇవ్వడం లేదు అని అంటాడు. అలా అని నా బిడ్డను చూడకుండా ఎలా ఉండాలి డాక్టర్ బాబు అని బాధపడుతుంది దీప. అప్పుడు దీప ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కార్తీక్ కన్నీళ్లు పెట్టుకోవడంతో వెంటనే దీప పైకి లేచి ఎందుకు ఏడుస్తున్నారు డాక్టర్ బాబు నిజంగానే నా ఆరోగ్యం అంతా బాగోలేదా అడుగుతుంది. ఇప్పుడు కార్తీక్ అలాంటిది ఏం లేదులే దీప అని అబద్ధం చూపి కవర్ చేస్తాడు.
మరొకవైపు సౌందర్య కారులో వెళుతూ చారుశీలకు ఫోన్ చేసి ఏమీ అనుకోకపోతే మనం ఒక చోట కలుద్దాం అని అనగా సరే అని అంటుంది చారుశీల. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు దీప తిన్నావా ప్లేటు కూడా కార్తీక్ తీసివేయడంతో ఈ పనులన్నీ మీకు ఎందుకు డాక్టర్ బాబు నేను చేస్తాను కదా అని అంటుంది. ఏం కాదులే దీప ఆరోగ్యం బాగోలేదు కదా అని అంటాడు కార్తీక్. నిజం చెప్పండి డాక్టర్ బాబు నాకు ఏమయ్యింది అని దీప పదే పదే అడగడంతో వెంటనే కార్తీక్ కోపంతో తన చేతిలో ఉన్న ప్లేట్లు విసిరేస్తాడు. నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు పదే పదే నాకు ఏమయింది అని అడిగి విసిగిస్తావు ఏదైనా ఉంటే నేను నీ దగ్గర దాస్తానా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దీప అని కోపంగా అరుస్తాడు. తర్వాత దీప బాధగా మాట్లాడడంతో వెంటనే కార్తీక్ కూల్ అవుతాడు.
చారుశీల ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో వస్తున్నాను అని బయలుదేరుతాడు కార్తీక్. అప్పుడు దీప నేను వస్తాను డాక్టర్ బాబు అని అనడంతో దీపక్ అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య ఒక చోటికి వెళ్లగా అంతలో అక్కడికి చారుశీల వస్తుంది. ఇప్పుడు కార్తీక్ వచ్చాడో లేదో అని అటు ఇటు చూస్తూ ఉంటుంది చారుశీల. అప్పుడు ఏంటి మేడం అని అనగా శౌర్య గురించి మాట్లాడాలని రమ్మని చెప్పాను అని అంటుంది.