Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని ఇంటి నుంచి వసుధార కోపంగా వెళ్ళిపోతుంది.
ఈరోజు ఎపిసోడ్లో దేవయాని సంతోషంగా ఉండడంతో ధరణిని అక్కడికి పిలుస్తుంది. కాఫీ ఏమైనా కావాలా అత్తయ్య ఆడడంతో కాఫీ ఏం అవసరం లేదు ధరణి అనడంతో ధరణి అప్పుడు కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు సరే ధరణి ఈరోజు నువ్వు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను చాలా సంతోషంగా ఉంది అని అనగా ఎందుకు అత్తయ్య అనడంతో అది నీకు చెప్పాల్సిన పని లేదు అని అంటుంది దేవయాని. అప్పుడు స్వీట్ ఏమైనా తీసుకురావాలా అత్తయ్య అనగా స్వీట్ వద్దు ఈసారి కొంచెం డిఫరెంట్ గా హాట్ తీసుకొని రాకూడదని అని పంపిస్తుంది.
అప్పుడు దేవయాని తన మనసులో ఈ దేవయాని ని చాలా తక్కువ అంచనా వేశావు నా గురించి నీకు తెలియదు. అని అనుకుంటూ ఉండగా ఇంతలో రిషి బొకే తీసుకుని రావడంతో అది చూసి దేవయాని ఆశ్చర్య అయిపోతుంది. రిషి వచ్చి రావడంతోనే వసుధార గురించి అడిగి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఏదో ఒకటి చేయాలి అని సరికొత్త డ్రామా మొదలు పెడుతుంది దేవయాని. రిషి వసుధార లేదు నాన్న ఇల్లు విడిచి వెళ్లిపోయింది అనడంతో రిషి షాక్ అవుతాడు.
అదేంటి పెద్దమ్మ ఎలా వెళ్తుంది అసలు ఏం జరిగింది అనడంతో కాలేజీలో ఎవరో తనని ఏదో అన్నారట అందుకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అనడంతో ఎవరు కాలేజీలో తనని ఎవరు ఏమన్నారు వాళ్ళ సంగతి చూస్తాను అనగా దేవయాని టెన్షన్ పడుతుంది. ఏమో తెలియదు రిషి జగతి గదిలోకి వెళ్ళింది వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకున్నారు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది అనడంతో జగతి గదిలోకి కోపంగా వెళ్తాడు రిషి. మేడం వసుధర ఎక్కడికి వెళ్లింది.
పెద్దమ్మ తనను ఎవరో ఏదో అన్నారని అంటుంది నిజమా ఎవరేమన్నారు చెప్పండి వాళ్ళ సంగతి చెబుతాను అని అనగా ఎంతమందికి అని సమాధానం చెబుతావు రిషి అని అంటుంది జగతి. మీ బంధం గురించి ప్రతి ఒక్కరు తప్పులు పడుతున్నారు ఈ రోజు ఇద్దరికి బుద్ధి చెబుతావు రేపొద్దున నలుగురు మరి తర్వాత పదిమంది ఇలా ఎంతమందికి సమాధానం చెబుతావు. ఒక ఆడ మగ మధ్య బంధం గురించి ఇతరులకు చెప్పే అవకాశం రానివ్వకూడదు అలా వచ్చింది అంటే అసలు అది బంధమే కాదు షాక్ అవుతాడు.
అప్పుడు రిషికి అర్థమయ్యే విధంగా చెప్పడంతో ఆలోచనలో పడి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరొకవైపు వసుధర ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటి ఓనర్ వసుధారని నానా మాటలు అని అవమానిస్తుంది. అలా మాట్లాడకండి పెద్దమ్మ అనడంతో పెద్దమ్మ అని పదేపదే అనకమ్మ ఒళ్లంతా తేర్లు, జర్లు పాకినట్టు ఉంది. నీ ఇంటికి ఎవరెవరో వస్తారు ఎప్పుడో పోతారు అంటూ రిషి వసదారాల బంధం గురించి చెడ్డగా మాట్లాడుతుంది.
దాంతో వసుధార సీరియస్ అవ్వగా అరవకమ్మ నీలాంటోళ్లు మా ఇంట్లో ఒక క్షణం ఉండడానికి వీల్లేదు అని వసుధార లగేజ్ మొత్తం బయటికి విసిరేసి తలుపులు వేస్తుంది. దాంతో ఏడ్చుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తుంది వసుధార. ఇప్పుడు అక్కడ కూర్చొని దేవయాని, కాలేజీ స్టాప్ ఆ ఇంటి ఓనర్ అందరూ అన్న మాటలు తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి వసుధార పక్కన కూర్చుంటాడు. ఏం జరిగింది వసుధార అని అడగడంతో ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి సార్ ఒక ఆడ మగ కలిసి ఉంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా మాటలతోనే హింసిస్తున్నారు.
టెక్నాలజీ డెవలప్ అయ్యింది అని అంటున్నారు కానీ ఆడపిల్లకు మాత్రం సమాజంలో గౌరవం లేకుండా పోయింది అని అంటుంది వసుధర. అప్పుడు రిషి నీ మాటలను బట్టి నేను కొంత అర్థం చేసుకుంటాను వసుధార అని అంటాడు. అప్పుడు సరే వసుధార మా ఇంటికి వెళ్దాం పద అని అనగా మీరే అన్నారు కదా సార్ మీ ఇల్లు అని అలాంటప్పుడు నేను అక్కడికి ఎందుకు రావాలి. ఆ ఇంట్లోకి రావడానికి నాకు ఏ అర్హత ఉంది అనడంతో రిషి షాక్ అవుతాడు. చెప్పండి సార్ నేను ఏ అర్హతతో ఆ ఇంటికి రావాలి అని అనగా రిషి మౌనంగా ఉంటాడు. అందుకే సార్ నేను ఎక్కడ ఉండదలుచుకోలేదు నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World