Karthika Deepam june 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా ఆటోని నిరుపమ్ కి తిరిగి ఇచ్చేస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, స్వప్న పెళ్లి పనులు చూసుకుంటూ ఉండగా ఇంతలో శోభ అక్కడికి వస్తుంది. బయట జ్వాలా ఆటో ఉంది ఏంటి అని అడగగా అప్పుడు స్వప్న జరిగింది మొత్తం వివరిస్తుంది. ఆ తర్వాత స్వప్న ఫోన్ వచ్చి పక్కకు వెళ్లడంతో నిరుపమ్ తో మాట్లాడుతూ ఉంటుంది శోభ. అప్పుడు నిరుపమ్ జరిగింది మొత్తం వివరించడంతో ఒకవైపు సంతోష పడుతూనే పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
మరొకవైపు జ్వాలా, నిరుపమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలా జరగడానికి అంతటికి కారణం హిమనే అని హిమ పై కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే సౌందర్య, ఆనంద్ రావు లు వస్తారు. అప్పుడు సౌందర్య జ్వాలతో మాట్లాడుతూ నీకు తెలియకుండా మేము ఒక పని చేసాము అని అంటుంది. అప్పుడు ఏం చేశారు అని అడగగా నువ్వు ద్వేషిస్తున్న ఆ తింగరి నీ తీసుకు వచ్చాము అనడం తో రగిలి పోతూ ఉంటుంది.
అయితే అప్పుడు ఆనంద్ రావు సౌందర్య ఎంత నచ్చచెప్పినా కూడా జ్వాలా వినిపించుకోకుండా కోపంతో రగిలిపోతుంది. అప్పుడు హిమ ని జ్వాలా మెడబట్టి బయటకు గెంటేస్తుంది జ్వాలా. అప్పుడు ఆనందరావు సౌందర్య మధ్యలో కలుగజేసుకోవడంతో మీరు మధ్యలో దొరికితే బాగుండదు నీకు నాకు ఫ్రెండ్షిప్ కూడా కట్ అవుతుంది చూడు సీసీ అంటూ వార్నింగ్ ఇస్తుంది.
అయితే అప్పుడు హిమ అసలు నిజం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా జ్వాలా వినిపించుకోదు. అంతేకాకుండా సౌందర్య ఆనందరావులపై మండిపడుతూ ఇలాంటి రాయబారాలు నడిపేలా ఉంటే ఇంకొకసారి మా ఇంటి గడప తొక్కదండి అని చెప్పి ముఖం మీద తలుపులు వేస్తుంది.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని తలచుకుని హిమను బాధతో కుమిలిపోతూ ఉండగా అక్కడికి Bసౌందర్య ఆనందరావు వచ్చి హిమకు ధైర్యం చెబుతారు. ఆ తర్వాత నిరుపమ్, హిమ ఇద్దరు గుడి లో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు నిరుపమ్, నీతో నాకు పెళ్లి ఫిక్స్ అయినందుకు ముడుపు కడతాను అని అనగా, అప్పుడు హిమ ఎలా అయినా నీకు జ్వాలాకు పెళ్లి జరగాలి అని ముడుపు కడతాను అని అంటుంది.
Read Also : Karthika Deepam june 28 Today Episode : శోభ చెంప చెళ్లుమనిపించిన హిమ.. స్వప్నకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జ్వాలా?