Manchu Vishnu : మా అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలుపొంది అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మా ఎన్నికల్లో చేసినవాగ్దానాలు ఇప్పుడు చేయడం లేదని చెప్పి జయసుధ గారు మంచు విష్ణు పై ఒక్కసారిగా మండిపడ్డారు. మంచు విష్ణు అధికారంలోకి వచ్చిన వెంటనే మా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తాను అని ప్రామిస్ చేశారు. ఇక ఇప్పుడు దాని విషయం గురించి పట్టించుకోవడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక మా ఎన్నికలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. మా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు పోటీ పడిన అభ్యర్థులు తదితర అంశాలు నిత్యం చర్చలో నిలుస్తున్నాయి. మా ఎలక్షన్ సృష్టించే వివాదం ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూనే వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో మా ఎన్నికలు అనేవి వివాదాలకు అడ్డాగా మారిపోయాయి.
మంచు విష్ణు మా అధ్యక్ష పదవిని చేపట్టి పది నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ తను ఇచ్చిన మాట మీద నిలబడటం లేదని తన సొంత ఖర్చులతో మా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటివరకు దాని గురించి ఏమీ స్పందించడం లేదని జయసుధ గారు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈమధ్య రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో మా బిల్డింగ్ నిర్మాణం గురించి చర్చకు వస్తుందేమో అనుకున్నాను. కాని దాని గురించి ఎవరు స్పందించకపోవడంతో తాజాగా ఈ ఇష్యూపై జయసుధ గారు రియాక్ట్ అయ్యారు.
Manchu Vishnu : మా బిల్డింగ్ నిర్మాణం.. చెప్పేవాళ్లే.. కానీ, చేసేవాళ్లు ఒక్కరు లేరు..
మురళీ మోహన్ గారి అధ్యక్ష పదవి చేపట్టిన కాలంనుండి ఇప్పటివరకు మాటలు చెప్పే వాళ్ళు కానీ చేతులు చూపించే వాళ్ళు ఒక్కరు లేరు. ఇక మంచు విష్ణు నైనా ఆ పని పూర్తి చేస్తాడేమో అనుకున్నా కానీ ఈయన కూడా అలాగే చేశాడు. ఇక ఈ మా గొడవలు చాలా అసహ్యంగా ఉన్నాయని వాటిని తట్టుకోలేక ఒక నెలరోజులు అమెరికా వెళ్లి వచ్చాను అని జయసుధ అన్నారు.
ఇకపోతే ఈ భవనం చర్చల్లోక ఇకపోతే ఈ భవనం చర్చల్లోకి రావడం తప్ప పూర్తి కావడానికి పాతికేళ్ళ సమయం పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కామెంట్లు చేశారు. రీసెంట్ గా ఓ మీడియాతో ముచ్చటించిన జయసుధ మా ఎన్నికల అధ్యక్షుడు మంచు విష్ణు పై ఈ విధంగా ఘాటు విమర్శలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్ డాన్సుతో ఊపేసారుగా.. వీడియో!