#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

, ,

Guppedantha Manasu january 19 Today Episode : వసుధారపై సీరియస్ అయిన రిషి.. సుమిత్రని జాగ్రత్తగా చూసుకుంటున్న చక్రపాణి.?

By Ramesh Babu

Published on: January 19, 2023 10:02 AM

Updated on: January 20, 2023 8:47 AM

Follow Us

---Advertisement---

Guppedantha Manasu january 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, రిషి ఇంటికి వెళుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని నిన్ను అని వసుధార మీదకు వెళుతుండగా మీరు ఆగండి ఈ వసుకి బుద్ధి చెప్పడానికి నేను చాలు అని అంటుంది జగతి. ఏంటి వసుధార గారు ఎందుకు ఇలా వచ్చారు. రిషి సార్ తో మీకేంటి పని అనగా మేడం నేను రిషి సార్ తో మాట్లాడాలి అనడంతో జగతి కోపంతో వెళ్ళిపో వసుధార అని అంటుంది. ఇంకెక్కడ రిషి సార్ దెబ్బకు ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా అని దేవయాని అనడంతో వదిన గారు మీరు ఆగండి అంటాడు మహేంద్ర. వసుధార మేడం ఇది మా ఇల్లు ఇది మా ఇంటికి సంబంధించిన ప్రాబ్లం మీరు వెళ్లిపోండి మేడం అంటాడు.

Guppedantha Manasu january 19 Today Episode
Guppedantha Manasu january 19 Today Episode

సార్ మీరు నన్ను మేడం గారు అని పిలవడం ఏంటి సార్ అనడంతో గొప్ప గొప్ప పనులు చేశారు కదా అని అంటుంది జగతి. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయం మాట్లాడాలి అనడంతో కాలేజీలో మాట్లాడాలి ఇంటి దగ్గర కాదు అని మహేంద్ర సీరియస్ అవ్వడంతో ఫణీంద్ర నువ్వు ఆగు మహేంద్ర ఎందుకు అలా సీరియస్ అవుతున్నావు అంటాడు. అప్పుడు జగతి మర్యాదగా చెబుతున్నాను వసుధార గారు బయటికి వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు వసుధార ఎంతసేపటికి వినకపోవడంతో జగతి వసదారాన్ని బలవంతంగా బయటకు గెంటేసి ముఖం మీద తలుపులు వేస్తుంది. ఆ తర్వాత జగతి బాధపడుతూ ఉంటుంది.

ఆ తర్వాత వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మానాన్న నీ దగ్గరికి రప్పించుకోవడం కోసం నన్ను ఇలా కష్టాలు పెడుతున్నావా, నా మెడలో ఉన్న ఈ తాళిబొట్టు రిషి సార్ కట్టాడు అని నా మనసు చెబుతోంది. అంటూ తన బాధలు దేవుడితో చెప్పుకుంటూ ఉంటుంది. మరొకవైపు రిషి కారులో వెళ్తూ ఏంటి వసుధార ఏం చేస్తున్నావు నువ్వు మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి వచ్చావు. ఎన్నో మాటలు చెప్పావు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చావు అనుకుంటూ ఉంటాడు. అలా రిషి ఆలోచించుకుంటూ అమ్మవారి గుడి దగ్గరికి రావడంతో అక్కడ వసుధారని చూసి ఏంటి వసుధార ఇక్కడ ఉంది అనుకొని వసుధార మెడలో తాళిబొట్టు చూసి వెనక్కి వెళ్ళిపోతూ నేను వసుధార చూసి వెనక్కి వెళ్ళడమేంటి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాను అని రిషి అక్కడికి వెళ్తాడు.

రిషి ని చూసి సంతోష పడుతూ నాకోసం రిషి సార్ నీకు పిలిపించావా అమ్మ థాంక్స్ అమ్మ అని దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అనడంతో వెంటనే రిషి కోపడుతూ నాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు అని అంటాడు. నా పెళ్లి విషయం నీ పెళ్లి విషయం గురించి నాకేం చెప్పొద్దు వసుధార అని సీరియస్ అయ్యి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఇంతలోనే అక్కడికి ఒక పూల ఆమె వస్తుంది. ఏంటి బాబు బాగున్నారా నాతో పూలు కొనకుండానే వెళ్ళిపోతారా, అమ్మగారు కూడా వచ్చారు కదా అని పూలు తీసుకోండి బాబు అనడంతో రిషి పూలు తీసుకొని ఆ పూలన్నీ తీసుకొని వెళ్లి అమ్మవారి దగ్గర పెట్టండి అని అంటాడు.

పూలు తీసుకోవడంతో వసుధార మనసులో ఏముంది. ఎందుకు ఇలా చేస్తోంది అని రిషి అక్కడి నుంచి వెళ్లి గుడి బయట కారు పక్కకు ఆపి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పూలు తీసుకొని పరధ్యానంలో ఆలోచించుకుంటూ ఆ పూల వైపు చూస్తూ వెళ్తుండగా ఇంతలోనే లారీ ఎదురుగా వస్తుండడంతో రిషి పరిగెత్తుకుంటూ వెళ్లి వసుధార కాపాడుతాడు. చూసుకోవాలి కదా అని సీరియస్ అవుతాడు. తర్వాత వసుధార కోసం ఒక క్యాబ్ బుక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరొకవైపు చక్రపాణి సుమిత్ర కోసం కాఫీ తీసుకుని వస్తాడు. మీరు నా కోసం కాఫీ తేవడం ఏంటి సేవలు చేయడం ఏంటి అని సుమిత్ర అనడంతో ఇన్ని రోజులు ఈ రాక్షసుడుకి నువ్వు సేవలు చేసావు కదా ఏం కాదులే సుమిత్ర కాఫీ తాగు అంటాడు.

అప్పుడు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీ ఆరోగ్యం బాగా అయ్యే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అనడంతో సుమిత్ర సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత చీపురు తీసుకొని ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా అది చూసి సుమిత్ర సంతోషపడుతుంది. మరొకవైపు వసుధార పుష్ప ఇద్దరు కలిసి పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంతలోనే వసుకి సుమిత్ర ఫోన్ చేస్తుంది. బాగున్నావా అమ్మ అనగా బాగున్నాను అమ్మ మీ నాన్న నన్ను కాళ్ళు కిందకు పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు సంతోష పడుతూ ఉంటుంది.

Read Also : Guppedantha Manasu january 18 Today Episode : వసుని కొట్టబోయిన జగతి.. వసుని అవాయిడ్ చేస్తున్న రిషి?

, , , , , ,

Join our WhatsApp Channel