Guppedantha Manasu November 23 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి మహేంద్ర తో ఎమోషనల్ గా మాట్లాడతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి నేను ఏదో తెలిసి తెలియక ఒక మాట అలా విడిచి వెళ్ళిపోతారా, నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని రిషి అడగగా రిషి నువ్వు నీకు శిక్ష వేశానని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను దూరం పెట్టి నాకు నేనుగా శిక్ష వేసుకున్నాను అని అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి మహేంద్ర వైపు చూస్తూ డాడీ మీరు నాకు కావాలి డాడీ మీ ప్రేమ కావాలి నన్ను విడిచి వెళ్ళిపోవద్దు ఒకవేళ తప్పు చేస్తే కొట్టండి అరవండి అంతేకానీ నన్ను వదిలి వెళ్ళిపోవకండి అని అంటాడు రిషి. మీరు లేని రిషి ఆ ఇంట్లో ఎలా ఉంటాడో ఒక్కసారి ఊహించుకోండి ఎంత నరకం అనుభవిస్తున్నానో అని అనడంతో ఆ మాట విన్న జగతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

Guppedantha Manasu November 23 Today Episode
అయితే అప్పుడు రిషి ఎన్ని మాటలు మాట్లాడిన మహేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో సరే డాడ్ మీకు ఈరోజు టైం ఇస్తున్నాను ఈరోజు రాత్రి మాత్రం ఆలోచించుకోండి. రేపు ఉదయం తెల్లవారి సరికల్లా మీరు ఇంట్లో ఉండాలి. మీ కొడుకుని మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి వచ్చి మహేంద్రను హత్తుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు ని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి తన గదిలో కూర్చుని మహేంద్రతో తాను అన్న మాటల గురించి తలుచుకొని ఆలోచిస్తూ డాడ్ నిజంగానే వస్తారా అని అనుకుంటూ ఉంటాడు.
మరొకవైపు హాల్లో కూర్చున్న వసు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రిషి ఏం చేస్తున్నావ్ వసుధర అని మెసేజ్ చేస్తాడు. ఏమి లేదు సార్ ఆలోచిస్తున్నాను అని అనడంతో, నిజంగానే డాడ్ వస్తారా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసు బాల్కనిలో కలుద్దామా అని అనడంతో సరే అని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడు రిషి డాడ్ వాళ్ళు లేకుండా ఇన్ని రోజులు ఉన్నాను కానీ రేపు ఉదయం వరకు ఉండాలి అంటే ఎలాగో ఉంది వసు నిజంగానే డాడ్ వాళ్ళు వస్తారు కదా అని అడుగుతాడు. అప్పుడు వస్తారు సార్ అంటూ రిషికు ధైర్యం చెబుతుంది వసు.
Guppedantha Manasu నవంబర్ 23 ఎపిసోడ్ : రిషి దగ్గరికి వెళ్లాలనుకున్న జగతి, మహేంద్ర..
మరొకవైపు మహేంద్ర, జగతి ఇద్దరు సంతోషంగా ఉంటారు.. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు మహేంద్ర అని జగతి అడగడంతో నేను నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను అని అనగా జగతి సంతోష పడుతూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా మహేంద్ర అనడంతో అవును జగతి ఎప్పడెప్పుడు తెల్లారుతుందా నా కొడుకు దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎంతో ఆత్రుతగా ఉంది అని అంటాడు మహేంద్ర. మరొకవైపు వసు రిషి ఇద్దరు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వస్తుండగా అది చూసిన దేవయానికి కోపంతో రగిలిపోతుంది. ఏంటి రిషి ఈ టైంలో కూడా పడుకోకుండా ఇంకా మేలుకున్నారు అనడంతో నిద్ర రాలేదు పెద్దమ్మ అని అంటాడు రిషి.
అప్పుడు ఏంటి వసు ఏంటి సమయంలో ముచ్చట్లు పెట్టుకున్నారా అని అనడంతో పెద్దమ్మ తనని ఏమి అనకండి తనది ఏం తప్పులేదు అని ఉంటాడు రిషి. పడుకోవచ్చు కదా రిషి అనడంతో లేదు పెద్దమ్మ నాన్న వాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను అనడంతో వాళ్లు రావాలి అనుకుంటే వస్తారు లేదంటే లేదు అని అంటుంది. అయినా నీ మీద నిజంగా ప్రేమ ఉంటే అసలు ఇంట్లో నుంచి వెళ్లిపోయేవారు కాదు అనడంతో వెంటనే వసు జరిగిన విషయాల గురించి కాకుండా జరగబోయే విషయాల గురించి ఆలోచించండి మేడం అని దేవయానికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది.. మరొక మహేంద్ర దంపతులు రిషి దగ్గరికి వెళ్లడానికి సంతోషంగా ఆనందంగా రెడీ అవుతూ ఉంటారు.