International Women’s Day 2022 : మహిళలకు జోహార్లు.. రేపటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. (International Women’s Day 2022) శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. 2022 ఏడాదిలో కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. మంగళవారం (international women’s’ day 2022 On March 8) జరుపుకోనున్నారు. ప్రతి ఏడాదిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదో ఒక స్పెషల్ థీమ్ ఉంటుంది. 2022 ఏడాదిలో కూడా సరికొత్త థీమ్‌తో ముందుకొస్తోంది మహిళా దినోత్సవం.
“సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. అంటే.. ‘రేపటి మహిళలు’ చెప్పవచ్చు.. పలు రంగాలలో మహిళలు, బాలికలు సాధించిన విజయాలు, సహకారాలను గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మహిళల దినోత్సవానికి వందేళ్ల నాటి చరిత్ర ఉంది.. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మహిళలకు ప్రత్యేకమైన రోజుగా చెబుతారు.. అసలు మహిళల దినోత్సవం చరిత్ర ఏంటి? అది ఎప్నుడు, ఎలా ప్రారంభమైంది.. అసలు మార్చి 8న మహిళల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
International Women’s Day 2022 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర.. ఎలా ప్రారంభమైందంటే? :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( (International Women’s Day History) ఎలా ప్రారంభమైందో తెలుసా? ఒక కార్మిక ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి అప్పట్లో మహిళా దినోత్సవంగా గుర్తించడంతో అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకగా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవానికి వందేళ్ల నాటి చరిత్ర ఉంది.. వాస్తవానికి ఇది.. 1908లోనే మొదలైంది. మహిళల్లో చైతన్యం వచ్చిన తర్వాత తక్కువ పనిగంటలు, ఓటు హక్కు, పురుషులతో సమానమైన వేతనం కోసం న్యూయార్క్ నగరంలో మహిళలందరూ నిరసనకు దిగారు. అప్పట్లో మహిళల డిమాండ్ల ఆధారంగా అమెరికాలో సోషలిస్టు పార్టీ 1909 ఏడాది జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది.
ఆ తర్వాత జాతీయంగా నుంచి అంతర్జాతీయంగా మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ క్లారా జెట్కిన్ అనే మహిళ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు మహిళలంతా ముందుకు రావడంతో ప్రపంచంలో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911లో స్విట్జర్లాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో నిర్వహించారు. ఆ తర్వాత 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలను కూడా జరుపుకున్నారు. 2022లో జరుపుకోబోయేది 109వ అంతర్జాతీయ మహిళల దినోత్సవం.. 1975వ ఏడాదిలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఒక థీమ్ ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
International Women’s Day 2022 : మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకంటే?
1917 యుద్ధంలో జరిగింది. అప్పట్లో రష్యాకు చెందిన మహిళలు ఆహారం-శాంతి కోసం సమ్మెకు దిగారు. దాదాపు 4 రోజులు ఈ సమ్మె కొనసాగింది. మహిళల సమ్మె దెబ్బకు అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా2 తన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత తాత్కాలికంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడే మహిళలకు ఓటు హక్కును కూడా కల్పించారు.
అయితే మహిళలు సమ్మెకు దిగిన రోజు ప్రకారమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. రష్యాలో జూలియన్ క్యాలెండర్ ప్రకారం.. (ఫిబ్రవరి 23 ఆదివారం)గా చెబుతారు. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. పరిశీలిస్తే ఆ రోజు మార్చి 8వ తేదీ.. అప్పటినుంచి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ మాత్రమే.. అందుకే మార్చి 8న అధికారికంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
International Women’s Day 2022 : మహిళల దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారంటే? :
అంతర్జాతీయ మహిళల దినోత్సవం… మహిళలకు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. రష్యాతోపాటు కొన్ని దేశాల్లో జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. మహిళల దినోత్సవానికి ముందు రెండు మూడు రోజుల నుంచే వేడుకల హడావుడి ప్రారంభమవుతుంది. మార్చి 8న అంతర్జాతీయంగా మహిళల దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. రష్యాలో ప్రత్యేకించి పువ్వులను అత్యధికంగా కొనుగోలు చేస్తారు. ఆ రోజున మహిళలకు రోజులో సగం పనిగంటలే.. మిగతా గంటలను సెలవుదినంగా ప్రకటించారు.
చాలా చోట్ల ఇది కొనసాగడం లేదు. ఇటలీలో మాత్రమే లభించే మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులతో అంతర్జాతీయ దినోత్సవ వేడుకులను ఘనంగా జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఇటలీలో ప్రారంభమైందో ఎప్పుడో ఇప్పటికీ తెలియదు.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్ నగరంలో ప్రారంభమైందని చెబుతుంటారు. అమెరికాలో మార్చి నెలను ప్రత్యేకించి మహిళల చరిత్రకు సంబంధించిన నెలగా ప్రకటించారు. అందుకే మార్చి నెలలో అమెరికా మహిళల విజయాలను గుర్తు చేసుకుంటూ వారికి గౌరవ సూచికంగా అధ్యక్ష ప్రకటన ఉంటుంది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం వెనుక ఇంత చరిత్ర ఉంది అనమాట..
Read Also : International Women’s Day 2022 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా?