Karthika Deepam: తెలుగు బులితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మోనిత శివకు డబ్బులు ఇస్తూ కార్తీక్ ముందు అడ్డంగా బుక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంత డబ్బులు శివకి ఎందుకు ఇస్తున్నావు తప్పుడు ఆలోచనలు ఉన్నవారే ఇలా ప్రతి ఒక్క రూపాయిని తప్పుడు పనులకు ఉపయోగిస్తుంటారు అనడంతో మోనిత ఆశ్చర్య పోతుంది. అప్పుడు మోనిత అవును కార్తీక్ నేను తప్పుడు పనికి ఉపయోగిస్తున్నాను. ఆ దీపను చంపమని వీనికి సుపారీ ఇస్తున్నాను అనడంతో శివ కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు మోనిత ఇదే కదా కార్తీక్ నువ్వు కోరుకున్నది ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు నీ అనుమానం తీరిందా అని అనడంతో వెంటనే కార్తీక్ అనుమానమైన నమ్మకమైన వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటుంది అని అంటాడు.
అప్పుడు మోనిత ఫ్లైట్ కిరాయిస్తూ నన్ను కాదు కార్తీక్ నేను నిన్ను అనుమానించాలి బంగారం తాకట్టు పెరి మరి ఆ వంటలక్క కు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే నేను ఏమనుకోవాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్ అసలు విషయం చెప్పలేదు అనడంతో మోనిత అబద్ధం చెబుతూ నేను బట్టల బిజినెస్ చేస్తున్నాను కార్తీక్ అందుకోసమే అడ్వాన్స్ ఇచ్చాను. అప్పుడు శివ అక్కడి నుంచి వెళ్తుండగా కార్తీక్ వెనక్కి పిలిచి మీ మేడం మీద ఒట్టేసి చెప్పు అని అనగా శివ మోనిత మీద ఒట్టేసి నిజమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు శౌర్య రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతూ జిరాక్స్ సెంటర్ కోసం వెతుకుతూ ఉంటుంది.
మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో సర్జరీ చేయాలి అని వెళ్తుండగా వెనకాలే మోనిత ఫాలో అవుతుంది. అప్పుడు కార్తీక్ ఈ మోనిత నామీద అనుమానం వచ్చినట్టు ఉంది అనుకుంటూ తప్పించుకోవాలి అనుకుంటాడు.ఆ తర్వాత దుర్గ దీప దగ్గరికి వెళ్లి దీపను నిద్ర లేపడంతో ఏమైంది దీపమ్మ అని అనగా హెల్త్ బాగోలేదు అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దర్గ దీప కోసం కాఫీ చేసి ఇస్తాడు.
మరొకవైపు కార్తీక్ డ్రైవింగ్ చేస్తూ ఎలా అయినా మోనిత నుంచి తప్పించుకోవాలి అనుకుంటుండగా ఇంతలోనే హాస్పిటల్ కి ఫోన్ చేసి సార్ కొంచెం తొందరగా రండి అని అంటారు. వెనకాలే ఉన్న మోనిత కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికే తిరుగుతున్నాడా తిరగడమేమైనా సరదానా అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య జరిగిన విషయం గురించి తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లి ఆ మోనిత సంగతి ఏంటో చూద్దాం అనుకుంటూ ఉంటే ఈ డాక్టర్ మాత్రం నన్ను ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత ఆనంద్ దగ్గరికి వెళ్లి మీ అమ్మ నిజంగా దురదృష్టవంతురాలు నీ నవ్వుకి నీ ఆనందానికి నోచుకోలేకపోయింది అని బాధపడుతూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఏంటి సౌందర్య వాడితో కబుర్లు చెబుతున్నావు అని అంటాడు. కార్తీక్ మీద ఆశతో సొంతం చేసుకోవాలన్న దురాశతో పుట్టినవాడు వీడు అని అంటుంది సౌందర్య. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మోనిత మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప శౌర్య గురించి ఆలోచిస్తూ మా అత్తమ్మ ఎక్కడ ఉందో ఎలా అయినా వెతకాలి అని సౌర్య ని వెతకడానికి బయలుదేరుతుండగా ఆరోగ్యం బాగోలేక ఎటు వెళ్లలేకపోతూ బాధపడుతూ ఉంటుంది.
మరొకవైపు చంద్రమ్మ దగ్గరికి ఇంద్రుడు వచ్చి జ్వాలమ్మ ఎక్కడ ఉంది అని అనటంతో బయట కూర్చుంది గండ అని అనటంతో లేదు చంద్రమ్మ మన పక్కింటి అతను జ్వాలమ్మ మన వీధి చివరికి అనిపించింది అని అనటంతో మనకు తెలియకుండా వాళ్ళ అమ్మానాన్న వెతకడానికి వెళ్లిందేమో గండ.అని అనుకునే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు.ఇంతలోనే శౌర్య అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మానాన్నలకు సంబంధించిన పోస్టర్స్ చూపించడంతో అది చూసి దంపతులు షాక్ అవుతారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.