IAS Cute Love Story : అదో ఖమ్మం అడిషినల్ కలెక్టర్ లవ్ స్టోరీ.. ఆ ట్రైనీ కలెక్టర్ క్యూట్ లవ్ స్టోరీకి సంబంధించి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలిచూపులో ప్రేమలో పడిన ఆయన.. పెళ్లివరకు ఎలా నడిపించారో అంతా ఒక కవిత రూపంలో అందంగా తీర్చిదిద్దారు. ఆ కవితను ఒక యానిమేషన్ రూపంలో వెడ్డింగ్ ఇన్విటేషన్ క్రియేట్ చేశారు.. ఇప్పుడా ఆ వెడ్డింగ్ కార్డు నెట్టంట్లో అందరిని ఆకట్టుకుంటోంది. బస్టాప్‌లో మొదలైన తొలిప్రేమ.. పెళ్లిపీటల వరకు ఎలా తీసుకెళ్లారనేది మొత్తం వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో చక్కగా చూపించారు.
బస్టాప్ లో కనిపించిన యువతిని చూడగానే తొలిచూపులో ప్రేమలో పడిపోయారు.. ఇక పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఆయనే… రాహుల్.. మహబూబ్ నగర్ జిల్లా.. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ 10వ తేదీన తాను ప్రేమించిన అమ్మాయి మనీషాని పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి సందర్భంగా తన ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో వెడ్డింగ్ కార్డును షార్ట్ వీడియో యానిమేషన్ గా రూపొందించారు.
IAS Cute Love Story : కలెక్టర్ క్యూట్ లవ్‌స్టోరీ.. వెడ్డింగ్ కార్డ్ వైరల్..
ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాహుల్-మనీషా.. ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పేయడంతో పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. బస్సులో మొదలైన ప్రేమ ప్రయాణం నుంచి దేవాలయంలో లవ్ ప్రపోజల్, ఆపై పెద్దలను ఒప్పించడం, ఎంగేజ్‌మెంట్.. ఫెళ్లి ఫిక్స్ కావడం అంతా వీడియో రూపంలో రూపొందించారు.
ఈ నెల 10న ఉదయం 11.55 గంటలకు ఐఏఎస్ అధికారి రాహుల్-మనీషా వివాహం మహబూబ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఖమ్మం ట్రైనీ కలెక్టర్‌గా పని చేస్తున్న రాహుల్ తన వాయిస్‌తో ఒక్క అందమైన కవితను జోడించారు. ఇప్పుడా వెడ్డింగ్ కార్డు యానిమేషన్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world