...

Huzarabad-Badwel ByPoll : హుజూరాబాద్‌లో పార్టీలు ఇలా.. బద్వేల్‌లో అలా.. విచిత్ర రాజకీయాలు

Huzarabad-Badwel ByPoll : తెలంగాణలోని హుజూరాబాద్‌లో, ఏపీలోని బద్వేల్‌లో మరో 10 రోజుల్లో బై ఎలక్షన్ జరగనుంది. ఎక్కడైనా ఎన్నిక అంటే ఆ వాతావరణమే వేరు. పెద్ద ఎత్తున ప్రచారాలు, విమర్శలు, ఆందోళనలు ఇలా అనేకం మనం చూస్తేనే ఉంటాము. గెలుపు కోసం ఆయా పార్టీలు చేయని ప్రయత్నాలు సైతం ఉండవు. అయితే హుజూరాబాద్‌లో ఇలాంటి వాతావరణం నెలకొంది. భూకబ్జాలు చేశారంటూ ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. దీంతో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.
Read Also : KTR Next CM : సీ స‌ర్వే ఎఫెక్ట్.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం?

దీంతో ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరైంది. జూన్‌లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఈటల రాజేందర్.. కొద్ది రోజుల్లోనే బీజేపీలో చేరారు. అప్పుడు మొదలైన రాజకీయ వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది. ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల ప్రచారం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక అది తారాస్థాయికి చేరింది. ఇక గెలుపు కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగి తమకు తోచిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అధికార పార్టీ నాయకులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. దీంతో పార్టీల నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలు, సభలు, ప్రచారాలతో హుజూరాబాద్ నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది.

ఎప్పుడు తమ వైపు చూడని నాయకులు సైతం ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు రావడాన్ని చూసి స్థానికులు ఓకింత ఆశ్చర్యానికి గురైన వారిచ్చే హామీలతో కాస్త ఖుషీ అవుతున్నారు. ఎలాగైనా సీఎంను, టీఆర్ఎస్‌ను ఈ ఉప ఎన్నికలో దెబ్బతీయాలని ఈటల రాజేందర్ పట్టుదలతో ప్రచారం చేస్తుండగా, మరో వైపు ఈటలను ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ చేయని ప్రయత్నాలు లేవు. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు దళితబంధు పథకాన్ని సైతం టీఆర్ఎస్ తీసుకొచ్చిందని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్ తరపున వెంకట్ పోటీలో నిలబడి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

Read Also :   JR NTR : యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కోసం గ్రూపులు కడుతున్న నేతలు… ఎందుకో తెలుసా!

హుజూరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉండగా.. ఏపీ లోని బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణించడంతో అక్కడ సైతం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బయ్య సతీమణి(సుధ) బరిలోకి దిగారు. మరణించిన వారి కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో ఉండటంతో ఉపఎన్నికను ఏకగ్రీవంగా చేయాలని పొలిటికల్ వ్యాల్యూస్‌తో సంప్రదాయాలను కొనసాగిస్తూ టీడీపీ, జనసేన పోటీలో నిలబడలేదు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలోకి దింపాయి. బీజేపీ నుంచి స్టూడెంట్ లీడర్ సురేశ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి కమలమ్మ బరిలోకి దిగారు. ఇక ఇక్కడ వైసీపీదే గెలుపు అని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బద్వెల్ నియోజకవర్గంలో బీజేపీకి, కాంగ్రెస్‌కు పట్టు లేకపోవడమే అందుకు కారణం. గత ఎలక్షన్స్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఘోర పరాభావాన్ని చవి చూశాయి. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో హోరాహోరీ సీన్ కనిపించట్లేదు.

Read Also : Ys Jagan: 2024 ఎన్నికల్లో జగన్ సరికొత్త నినాదం.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయం?