Human zoo park: జూ పార్క్ అంటే.. జంతువులు ఉండే పార్కని మన అందరికీ తెలుసు. అయితే అక్కడ చాలా జంతువులను బోనులో ఉంచుతారు. మరికొన్నింటిని ఫ్రీగా తిరగనిస్తారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ మనం ఇప్పుడు చూడబోయే జూలో మాత్రం జంతువులకు బదులుగా.. మనుషులనే బోనులో ఉంచుతారు. అయితే అదెక్కడ, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చోంగ్ కింగ్ అనే నగరంలో లేహెలెడు వైల్డ్ లైఫ్ జూలో జంతువులు స్వేచ్థగా విహరిస్తుంటే… మనుషులు మాత్రం బోనులో వెళ్లి తిలకించి వస్తుంటారు. జూ పర్యాటకులు లాక్ చేసిన బోనులోకి వెళ్తారు. ఆ క్రూర మృగాలు బోనుకు సమీపంగా వస్తుంటాయి, పులులు సింహాలు ఎలుగుబంట్లు ఆ బోను చుట్టూ తిరుగుతుంటాయి. అయితే ఆ జంతువులను బోను వైపు ఆకర్షించడానికి జూ నిర్వాహకులు సాహసోపేతమైన ఆడియాను అమల్లో పెట్టారు.
This is a human zoo where the animals can see the dangerous humans in the cages🤩
— Tansu YEĞEN (@TansuYegen) August 22, 2022
అదేంటంటే.. పచ్చి మాంసాన్ని పెద్ద ముక్కులుగా చేసి మనుషులు వెళ్లే ఆ బోనుకు బయట వైపు తగిలేస్తుంటారు. దీంతో ఆ జంతువులు బోను వైపు వస్తాయి. వాటి చుట్టే తిరుగుతుంటాయి. ఆ మాంసం తిని అక్కడే కాసేపు సేద తీరుతాయి. ఒక్కోసారి ఈ బోను ఎక్కి కూడా ఆడుకుంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.