...

Horoscope Today : ఈ రాశుల వారికి బ్యాడ్ టైం నడుస్తుందట.. కొత్త చిక్కులు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం

Horoscope Today: Astrological prediction for October : ప్రస్తుత కంప్యూటర్ యుగంలోనూ రాశి ఫలాలు, జాతకాలను నమ్మే వారు అధిక సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెల్లారితే ఏం జరుగుతుందోనని వారు ఆరాట పడుతుంటారు. అందుకోసం తమ ఈరోజు ఎలా గడుస్తుందోనని ఉదయం గానే టీవీ లేదా క్యాలెండర్ లో తమ రాశిఫలాలను చూస్తుంటారు.

ఇలాంటి వ్యక్తులు భవిష్యత్ గురించి అధికంగా భయపడుతుంటారని తెలుస్తోంది. నక్షత్రాలు, గ్రహాలు, గడియలు, రాహు కేతువుల ప్రభావాన్ని పూర్తిగా విశ్వసిస్తుంటారు. భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తుంటారని తెలిసింది. ఈ రోజు రాశి ఫలాల ప్రకారం ఎవరికి ఎలా కలిసివస్తుందో.. ఎవరికి వాహనయోగం, ధనయోగం, చెడు గడియలు సమీపిస్తున్నాయో తెలుసుకుందాం..
Ashwagandha : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!

Horoscope : ఈ రాశుల వారికి కొత్త చిక్కులు, అనారోగ్య సమస్యలు :
అక్టోబర్ 2021.. ఈ రోజున చంద్రుడు రోజంతా మకరరాశిలో కొనసాగుతాడు. ద్వాదశ తిథి ఉండగా.. శతభిష నక్షత్రం గడియలు.. ఉదయం 10 గంటల వరకు ఉంటుంది.

మేషరాశి : ఈ రాశి గలవారు ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగా గడుపుతారు. వీరికి సొసైటీలో గౌరవ మర్యదాలు పెరుగుతాయి. ఈ రాశి మహిళలు సంతోషం, సౌభాగ్యాలను పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలి. వీరిని తరచూ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా చెడు వ్యసనాలకు వీరు కొద్దిగా దూరం ఉండాలి.. అధిక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే.. మానసిక స్థితి, ఆందోళన మెరుగుపడతాయి. లేనియెడల చేపట్టిన పనులు వృథాగా మారే అవకాశం ఉంటుంది.

మిథున రాశి : నేడు వీరు చేపట్టిన ప్రతీ ప్రయత్నానికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. చుట్టాలు, స్నేహితులతో జాగ్రత్తగా మెలగాలి.. అధిక ఖర్చులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలోని వ్యక్తులతో మంచిగా ఉండటం బెటర్..

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పెనుభారంగా మారతాయి. అనుకోని ప్రయాణాలు చేయగలరు. అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. చుట్టుపక్కల వ్యక్తుల నుంచి అధికమైన ప్రెషర్ పెరుగుతుంది. అన్నివేళలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
Ganesha Slokams : ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందా? ఈ శ్లోకాలు పఠిస్తే చాలు..!

సింహ రాశి : ఈరాశి వారు కొత్తవారిని కలుసుకుంటారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి గౌరవం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు నుకూలిస్తాయి. అందరితో ఆనందంగా గడుపుతారు.

కన్యరాశి : ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఫ్యామిలీలోని గొడవలు, ఇబ్బందులు సమసిపోతాయి. మహిళలను హెల్త్ సమస్యలు వేధిస్తాయి. బయటకు వెళ్లినప్పుడు. చుట్టు పక్కల వారితో జాగ్రత్తగా మెలగాలి.

తుల రాశి : ఈ రాశి వారికి ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో కొత్త వివాదాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగే అవకాశం ఉంది.. చేసే పనుల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.

వృశ్చిక రాశి : వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్‌కు హాజరవుతారు. అదే విధంగా ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబంలో అనుకోని కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరగడంతో పాటు మానసిక ఆందోళన పెరుగుతుంది.

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి సమాజంలో రెస్పెక్ట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తమ విధుల్లో సరైన డెసిషన్స్ తీసుకుంటారు. చేపట్టిన పనులకు అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. జాబ్‌లో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.. ఇతరులతో వైరం ఏర్పడవచ్చు.

మకర రాశి : ఈ రాశి దంపతులకు పిల్లలతో కొత్త ఇబ్బందులు కలుగుతాయి. ఇదివరకే చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

మీన రాశి : వీరు ప్రారంభించిన పనులను సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఫ్యామిలీలో గొడవలు దూరమవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకోని ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది.
Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!