Groom fugutive: ఈ మధ్య కాలంలో పెళ్లిలో జరిగే ఎమోషనల్, సరదా సన్నివేషాలన్నీ వైరల్ గా మారుతున్నాయి. ప్రతీ ఒక్కరి తమ పెళ్లి జ్ఞాపకాలను వీడియోలు తీసుకోవడం.. వాటిని సోషల్ మీడియాల్లో పెట్టడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి యూత్ అంతా పెళ్లి అంటే సింపుల్ గా కాకుండా… ట్రెండ్ సెట్ అయ్యేలా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెళ్లి అంటే బంధుమిత్రుల మధ్య ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెళ్లి బాజా భజంత్రీలతో మొదలై అప్పగింతల వరకు ఎంతో ఘనంగా సాగుతుంది. అయితే ఇలా జరగాల్సిన పెళ్లి వేడుకలో విచిత్ర సంఘటన జరిగింది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లిలో వరుడుని మండపానికి తీసుకొచ్చే సమయంలో బ్యాండ్ మేళంతో ఊరేగించడం విషయం మన అందరికీ తెలిసిందే. అయితే గుర్రంపై వచ్చిన వరుడుకి బొట్టు పెట్టి, మంగళ హారతులు ఇస్తూ ఆహ్వానించారు. అలాగే మండపం వద్దకు రాగానే టపాసులు కూడా కాల్చారు. ఆ సౌండ్ కు ఖంగుతిన్న గుర్రం ఒక్కసారిగా పరుగులు పెట్టింది. వరుడు గుర్రం మీదనే కూర్చొని ఉండటంతో బంధు మిత్రులు షాకయ్యారు. దీంతో గుర్రాన్ని ఆపడానికి దాని యజమానితో పాటు బంధు మిత్రులతో పాటు అందరూ పరిగెత్తారు. పెళ్లి పూర్తి కాకముందే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.