Geetu Royal Shocking Comments on Nagarjuna about Her Elimination from Bigg Boss Telugu 6
Geethu Royal : బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎలిమినేట్ కావడం అందరిని షాకింగ్ గురిచేసింది. గీతూ కూడా తానే టైటిల్ విన్నర్ అని గట్టిగా నమ్మింది. కానీ, బిగ్ బాస్ గీతూ అంచనాలను తిప్పికొట్టి 9 వారాలకే గీతూ హౌస్ నుంచి గెంటేశారు. దాంతో గీతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తన ఎలిమినేషన్ విషయంలో గీతూ అసలే జీర్ణించుకోలేకపోయింది. కొన్నిరోజుల పాటు పబ్లిక్ కు దూరంగా ఉండిపోయింది.
ఆ తర్వాత నెమ్మదిగా గీతూ రాయల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. తనకు బిగ్ బాస్ హౌస్‌లో ఎదురైన అనుభవాలు, ఎలిమినేషన్ గల కారణాలను గీతూ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఇప్పటికి కూడా తాను ఎలిమినేషన్ షాక్ నుంచి బయపడలేదని వాపోయింది. ఎలిమినేషన్ చర్చకు వచ్చినప్పుడల్లా గీతూ కన్నీళ్లు ఆగడం లేదు. హౌస్‌లో గేమ్ విఫలం కావడానికి బిగ్ బాస్ సహా హోస్ట్ నాగార్జున కూడా పరోక్షంగా కారణమని గీతూ వాపోయింది.
తాను ఏం చేసినా బిగ్‌బాస్ ఏం అనేవాడు కాదని, నా గేమ్‌ని బిగ్‌బాస్ పొగిడేవాడని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ దత్తపుత్రిక గీతూ అంటూ ప్రచారం కూడా జరిగిందని, అదే తనకు కూడా అనిపించిందని గీతూ చెప్పుకొచ్చింది. హోస్ట్ నాగార్జున గీతూ ఆటను ఎంతో మెచ్చుకునే వాడని తెలిపింది. వీకెండ్ ఎపిసోడ్ గంట మాత్రమే చూపించారని తెలిపింది. నిజానికి నాలుగు గంటల వరకు ఎపిసోడ్ ఉంటుందని తెలిపింది.
అయితే ఎలిమినేషన్ రోజు నాగార్జున తనపై అనేక ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో నటించకుండా ఆడే కంటెస్టెంట్ ఒక గీతూ మాత్రమేనని అన్నారని తెలిపింది. చాలా సందర్భాల్లో తోటి కంటెస్టెంట్స్‌లోనూ గేమ్ పై ఆసక్తి పెంచేలా రెచ్చగొట్టిన విషయాన్ని చెప్పారని తెలిపింది. అందులో ఆ విషయాన్ని చూపించలేదని గీతూ వాపోయింది. హౌస్ రూల్ చేయకుండానే వెళ్లిపోతాననే బాధ ఉండేదని, నాగార్జున 9 వారాలు హౌస్‌ను ఏలింది నువ్వే గీతూ అన్నారనే విషయాన్నిఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
గీతూ ఆటను బిగ్‌బాస్, నాగార్జున బాగా మెచ్చుకోవడంతోనే తాను ములక చెట్టు ఎక్కానని చెప్పుకొచ్చింది. అదే తనపై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్‌కి దారితీసిందని వాపోయింది. ఇక టైటిల్ గెలిచేది తానే అనుకున్నానని, కనీసం టాప్ 5 లో ఉంటానని ఫిక్స్ అయినట్టు గీతూ చెప్పుకొచ్చింది. తన ఓవర్ కాన్ఫిడెన్స్ తన గేమ్ దెబ్బతీసిందని గీతూ ఆవేదన వ్యక్తం చేసింది. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.. గీతూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమె ఎలిమినేషన్ కారణమని అంటున్నారు.
బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించి తన రూల్స్ పెట్టడాన్ని హౌస్ మేట్స్ సహా అందరూ గీతూను తప్పుబట్టారు. తానో పెద్ద గేమర్ అంటూనే.. హౌస్‌లో కంటెస్టెంట్స్ చేత ఆట ఆడిస్తానంటూ గీతూ చెప్పడంతో నాగార్జున వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే గీతూ సంచాలకురాలిగా విఫలం కావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని బిగ్ బాస్ ప్రేక్షకులంతా అభిప్రాయపడుతున్నారు.
Read Also : Samantha : సమంత జాతకంలో ఏముంది? అందుకే ఇన్ని కష్టాలా? మళ్లీ ఆ ఘోరం జరగబోతుందా?!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.