Extra Jabardasth Latest Promo, 25th Feb 2022 : అప్పట్లో వ్యభిచారం చేస్తూ ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికడం హట్ టాపిక్‌గా మారింది.. ఆ సంగతి అందరూ మరిచిపోయినప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లలో అదే వ్యభిచారంపై పదేపదే పంచ్‌లు విసురుతూ మరి గుర్తు చేస్తున్నారు.. 2020 మార్చిలో విశాఖపట్నంలో వ్యభిచారంపై పోలీసుల దాడుల్లో మహిళలు, విటుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు కూడా పట్టుబడ్డారు. వారిద్దరూ ఎవరో అందరికి తెలిసిందే.. జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశిలు.. వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరకడం అప్పట్లో హట్ టాపిక్‌గా మారింది.
ఆ రోజు జబర్దస్త్ కమెడియన్లు ఇద్దరూ తమను వదిలేయని ప్రాధేయపడుతూ పోలీసులకు దండాలు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతా అయిపోయిందిలే.. అనుకుంటే.. మళ్లీ అదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కమెడియన్లు.. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో (Extra Jabardasth Latest Promo)లో అదే వ్యవహారంపై ప్రస్తావించారు. ఆ వ్యభిచారం వ్యవహారాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నారు.

Extra Jabardasth Latest Promo, 25th Feb 2022
దొరబాబు, పరదేశిలు, హైపర్ ఆది టీంలో వారే.. ఆది చేసే దాదాపు ప్రతి స్కిట్టులోనూ వారిద్దరి వ్యభిచారంలో దొరకడంపై పంచ్‌లు పడుతున్నాయి. ఈసారి మాత్రం అప్పటి వ్యభిచార వ్యవహారంపై మరింత క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు కమెడియన్లు.. ఎంతమంది పోలీసులు ఉన్నారు.. ఎన్ని లాఠీలు విరిగేలా కొట్టారు అనేది పూసగుచ్చినట్టుగా బయటపెట్టేశాడు పరదేశి. వ్యభిచార దాడుల్లో అడ్డంగా దొరికేసిన దొరబాబు, పరదేశిలను పోలీసులు బట్టలూడదీసి లాఠీలతో కొట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కదా.. పోలీసులు ఏమి అని ఉండరులే అని అనుకున్నారంతా.. లేటెస్ట్ ప్రోమోను చూస్తే.. ఆ రోజు మొత్తం 13 మంది పోలీసులు 13 లాఠీలతో కొల్లబొడిచారనే విషయాన్ని పరదేశి బయటపెట్టాడు.
‘పుష్ప’రాణి స్కిట్.. పంచులే పంచులు..
ఆది టీంలో ‘పుష్ప’రాణి స్కిట్ రోహిణి చేసింది.. ఇక మంగళం శీనుగా పరదేశి కనిపించాడు. అందులో ‘చెన్నై సరుకు ఎత్తుకుని పోతున్నావ్ కదా.. అన్ని చెక్ పోస్ట్‌లలో నీ మాటే వింటున్నారా? అని రోహిణి పంచ్ విసురుతుంది.. దానికి పరదేశి.. అన్ని చెక్ పోస్ట్‌లలో అందరూ వింటున్నారు. కానీ, ఒక్క వైజాగ్ చెక్ పోస్ట్‌లో తప్ప’ అని పరదేశి పంచ్ విసురుతాడు. వైజాగ్.. వైజాగ్‌లో ఏమైందమ్మీ అని పక్కనున్నామె అంటుంది.. దానికి ‘నీకు తెలియదుకదమ్మీ.. వైజాగ్‌లో సరుకుతో సహా దొరికిపోయాడు’ అంటూ రోహిణీ పంచ్ వేస్తుంది. ఇంతకీ ఆ సరుకు ఏంటో అంటూ నవ్వేశారు అక్కడివారంతా. స్కిట్ లో భాగంగా ఏంటి పుష్ప.. ఒకటి తగ్గింది అని మరో డైలాగ్ వినిపిస్తుంది.
అవును.. ఆ రోజు మొత్తం 13 లాఠీల ఉన్నాయని పరదేశీ అంటాడు. దానికి ఒకటి తగ్గింది అంటూ అతడు ప్లాష్ బ్యాగ్ గుర్తు చేసుకుంటున్నట్టుగా అంటాడు. వెంటనే నూకరాజు.. ఆ పట్టీ నీ దగ్గరే ఉందా అని పంచ్ విసురుతాడు. ఆ పట్టీ గోల ఏంటి అని అడుగుతాడు.. పోలీసులు దొరికేసిన సమయంలో తనను లాఠీలతో కుళ్లబొడిచారని, దాంతో ఆ నొప్పికి పట్టీ వేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. అప్పటి వార్తలన్నింటికీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు జబర్దస్త్ కమెడియన్లు. పట్టీ విషయం చెప్పగానే జడ్జి రోజా నవ్వు ఆపుకోలేకపోయారు. ఏది ఏమైనా పుష్ప రాణి స్కిటు మాత్రం బాగానే పేలినట్టుందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Technology News : కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన స్నాప్ చాట్…