Chaiwalla Patna : బిహార్ రాజధాని పట్నాలోని ఉమెన్స్ కాలేజీ ఎదుట ఓ యువతి టీ దుకాణం ప్రారంభించింది. అయితే ఆ ప్రాంతంలో అప్పటికే చాలా టీ దుకాణాలున్నాయి. కానీ ఈమె అక్కడే ఎందుకు టీ దుకాణం ప్రారంబించింది.. చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉందని అంతా భావించారు. అదే ప్రశ్నని ఆమెని అడగ్గా… ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశానని.. ఉద్యోగం లేక స్వయం ఉపాధి కోసం చాయ్ వాలాగా మారానని తెలిపింది. అయితే ఆమె అందించే రుచికరమైన చాయ్ తాగుతూ, ఆమె కథ వింటూ.. ఔరా అంటున్నారు.
ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తనకు స్వయం ఉపాధి కోసం చాలా ఆలోచించింది. చివరకు చాయ్ దుకాణం పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే టీ దుకామం పెట్టేందుకు డబ్బులు లేవు. ఎలా నిర్వహించాలో కూడా ఆమెకు తెలియదు. అయితే యూట్యూబ్ ను గురువుగా చేసుకొని టీ దుకాణం పెట్టాలనుకుంటిది.
రెండు నెలలపాటు నగరంలోని చిన్నచిన్న టీ దుకాణాలకు వెళ్లి.. అక్కడి వ్యాపార శైలిని అర్థం చేసుకుంది. బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి.. ముద్రా యోజన కింద లోన్ కోసం బ్యాంక్‌కు వెళ్లింది. అయితే.. స్థానికురాలు కాదు కాబట్టి రుణం ఇవ్వలేమన్నారు బ్యాంక్ సిబ్బంది. స్నేహితుల సాయంతో రూ.30వేలు సమకూర్చుకుని.. ఎట్టకేలకు తన కలల చాయ్ దుకాణం తెరిచింది. అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది.
ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీ దుకాణం నడుపుతోంది ప్రియాంక. మసాలా చాయ్, అల్లం చాయ్, పాన్ చాయ్, చాక్లెట్ చాయ్ సహా మొత్తం ఐదు రకాల టీలు అందిస్తోంది. త్వరలో సాయంత్రం వేళల్లోనూ టీ దుకాణం నిర్వహించాలని భావిస్తోంది. చాయ్‌వాలీగా మారిన వారం రోజుల తర్వాత ఇంట్లో వారికి ప్రియాంక అసలు విషయం చెప్పింది. టీ దుకాణం నడపడం ఏంటని తొలుత తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా.. చివరకు కుమార్తెతో ఏకీభవించారు. తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Also : Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!