Video Viral : ఫుల్ గా తాగి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు డాన్స్ చేసిన మహిళ.. వీడియో వైరల్?

Updated on: January 25, 2023

Video Viral : సాధారణంగా మద్యం సేవించి వాహనం నడప రాదు అన్న విషయం తెలిసి కూడా చాలా మంది మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నప్పుడు పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. అయితే కొంతమంది పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పోలీసులకు డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడి పోలీసులను తప్పించుకునేందుకు ఇప్పటికే చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

drunk-woman-tries-escape-breathalyser-test-by-dancing-in-front-of-police
drunk-woman-tries-escape-breathalyser-test-by-dancing-in-front-of-police

తాజాగా ఒక మహిళ కూడా ఈ మద్యం సేవించి పోలీసులకు అనుమానం రాకుండా ఉండటం కోసం ఏకంగా పోలీసులు ముందే డాన్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక 38 ఏళ్ళ మహిళా పబ్ కి వెళ్లి ఫుల్ గా తాగి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే మధ్యలో ఆమెను రోడ్డుపై పోలీసులు ఆపి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ కోసం బ్రీత్ అనలైజర్ ను బయటకు తీశారు. ఆ తర్వాత ఆ మహిళను దానిలోకి ఊపాలి అని పోలీసులు కోరారు. కానీ ఆ మహిళ అలా చేయడానికి నిరాకరించింది. అయితే అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తను నిజంగానే తాగలేదు, కావాలంటే చూడండి అంటూ పోలీసుల ముందు డాన్స్ చేయడం కూడా మొదలుపెట్టింది.

Advertisement

డాన్స్ చేసి కాసేపటికి ఆగిపోయింది. అప్పుడు పోలీసులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా డాన్స్ చేస్తూనే ఉంది. తనని వదిలేయమంటూ పోలీసులను వేడుకుంది. ఇక ఆమె కోరిక మేరకు పోలీసులు ఒక వైట్ లైన్ పై తూగకుండా నిలబడమని చెప్పారు. ఇక పోలీసులు చెప్పినట్టు ఆ మహిళ చేసే ప్రయత్నం చేసినప్పటికీ నాలుగు అడుగులు కూడా నడవలేకపోయింది. అంతే కాకుండా పోలీసులతో వాదనకు కూడా దిగింది. మహిళ ప్రవర్తన పట్ల విసిగిపోయిన పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేశారు. తాగి వాహన నడుపుతోంది అంటూ ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

Read Also : Viral Video : చమ్మా చమ్మా..అంటూ రెచ్చిపోయిన ఎయిర్ హోస్టెస్‌.. వైరల్ వీడియో…!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel