Traffic Challan: మీరు ప్రయాణించే దారిలో నిత్యం ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపుతూ మీకు చలాన వేస్తున్నారా? ఇలా తరచూ ట్రాఫిక్ పోలీసులకు దొరికి చలానా లతో ఇబ్బంది పడే వారు ఈ చిన్న పని చేస్తే మీకు చాలా ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. మరి చలానా నుంచి విముక్తి పొందాలంటే చేయాల్సిన ఆ చిన్న పని ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా మన దగ్గర హెల్మెట్ మాస్క్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ లైసెన్స్ లేకపోవడంవల్ల ఇలాంటి ట్రాఫిక్ చలానాలు మన పై పడతాయి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఆపి వీటిని అడుగుతారు అయితే బయటకు వెళ్ళిన ప్రతిసారి వీటన్నింటిని తీసుకు వెళ్లడం కుదరదు కనుక మొబైల్ డాక్యుమెంటరీలో వీటన్నింటిని భద్రపరచుకోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ఏ విధమైనటువంటి చలానా చెల్లించే అవసరం ఉండదు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజీలాకర్ యాప్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవచ్చు. మీకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా ఈ యాప్ లో భద్రపరుచుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళిన ఆధార్ కార్డు పాన్ కార్డు వంటివాటిని వెంట తీసుకోకుండా ఇలా యాప్ లో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులకు లేదా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ డాక్యుమెంటరీ ఉపయోగించి ట్రాఫిక్ పోలీసులకు మన వివరాలన్నింటినీ చూపించడం వల్ల ట్రాఫిక్ చలానాలు పూర్తిగా తగ్గుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రాఫిక్ చలానాల నుంచి విముక్తి పొందండి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World