Guppedantha Manasu june 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార మినిస్టర్ గారి ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసి జగతి కి కాల్ చేసి కంప్లీట్ అయింది చెక్ చేసి చెప్పమని అనగా, అప్పుడు జగతి నేను కాదు మీ రీచార్జ్ ఫైనల్ చేసి చెప్పాలి అని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత జగతి దగ్గరికి మహేంద్ర, గౌతమ్ వస్తారు. అప్పుడు మహేంద్ర ఆ ప్రాజెక్ట్ ఇంకా అయిపోలేదా అని అనగా వెంటనే జగతి ఇప్పుడే వసుంధర కంప్లీట్ చేసి నాకు పంపించింది అని అనడంతో గౌతమ్ వర్క్ విషయంపై వసు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని పొగుడుతాడు.
ఆ తర్వాత వారు ముగ్గురు రిషి విషయం గురించి తలచుకుని బాధ పడతారు. రిషిని ఎలా అయినా మామూలు మనిషిని చేయాలి అని అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం రిషి కాఫీ తాగుతూ ఉండగా మహేంద్ర దంపతులు, వసు మినిస్టర్ ఇచ్చిన ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ధరణి వాళ్లకు జ్యూస్ తీసుకుని వెళుతూ ఉండగా దేవయాని ఆపి వారి గురించి వెటకారంగా మాట్లాడటం తో పనింద్ర దేవయానికి స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతాడు.
మరోవైపు రిషి, వసు వైపు చూస్తూ ఉండిపోతాడు. తర్వాత జగతి,రిషికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉండగా మధ్యలో మహేంద్ర, రిషిని వెటకారం గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత గౌతమ్, కాలేజీ స్టాఫ్ మేడం, వసు ముగ్గురు కలిసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడానికి కలిసి పని చేస్తూ ఉంటారు
వాళ్లు ఉన్న ఏరియాలోకి రిషి వచ్చి వసు గురించి ఆలోచిస్తూ ఉండగా వసుధార కనిపించడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు ఫణీంద్ర, దేవయాని భోజనం చేస్తూ ఉండగా అప్పుడు పనింద్ర ఇంకేంటమ్మా ధరణి ఏదైనా కోర్సు చేయవచ్చు కదా అని అనగా అప్పుడు వెంటనే దేవయాని ఇంట్లో ఉంటూ వంటపని, ఇంటి పనులను సరిగ్గా చేసుకుంటే చాలు అని అంటుంది.
ఆ తర్వాత దేవయాని, ఫణీంద్ర ఒకరికొకరు వాదిస్తూ ఉండగా ఇంతలో మహేంద్ర దంపతులు అక్కడికి వస్తారు. అప్పుడు ఫణీంద్ర వారిని భోజనం చేయమని పిలవగా అప్పుడు జగతి లేదు బావగారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి స్లం ఏరియా కి వెళ్ళినప్పుడు అక్కడ వారితో కలిసి భోజనం చేశాను అని అనడంతో అప్పుడు దేవయాని స్లమ్ ఏరియా వాళ్లతో కలిసి భోజనం చేయడం ఏంటి మన రేంజ్ ఏంటి అంటూ తింటూ చేయి కడిగేసుకుని వెళ్ళిపోతుంది.
ఆ విషయంలో మహేంద్ర దంపతులు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత గౌతమ్ కాలేజీ స్టాఫ్ మేడం మాట్లాడుతూ కార్లో వెళ్తూ ఉండగా రిషి ఫోన్ చేసి వసుధార కోసం ఎంక్వైరీ చేస్తూ ఉండగా గౌతమ్ కొద్దిసేపు ఆట పట్టిస్తాడు. ఆ తర్వాత గౌతమ్ వసుధార సైకిల్ పై వెళ్ళింది అని అనడంతో రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో రిషి, వసు ఒక చోట కలిసి క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు నేను ఎప్పటికీ ఒకే మాటమీద ఉంటాను అని అంటాడు రిషి. ఆ మాటకు వసు ఫీల్ అవుతూ ఉంటుంది.
Read Also : Guppedantha Manasu June 22 Today Episode : వసుని బాధపెట్టిన రిషి.. ఆలోచనల్లో పడ్డ జగతి, మహేంద్ర..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World