Karthika Deepam: వంటలక్కతో కలిసి కార్తీకదీపాలు వెలిగించిన డాక్టర్ బాబు.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఆనందరావు, హిమ వెళ్లిపోవడంతో పెద్ద గండం తప్పింది అని ఊపిరి పీల్చుకుంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య చంద్రమ్మ దంపతులపై సీరియస్ అవుతూ ఆటో ఎందుకు అమ్మేశారు బాబాయ్ అని అనగా అప్పుడు ఇంద్రుడు చెప్పాను కదా అమ్మ ఆరోగ్యం బాగోలేక అని అనడంతో లేదు బాబాయ్ మీరు మారిపోయారు నా ఫంక్షన్ తర్వాత మీ ఇద్దరిలో చాలా మార్పు వచ్చింది అని కోపంగా వాళ్ళపై అరిచి అక్కడ నుంచి వెళ్లిపోతుంది సౌర్య. అప్పుడు ఇంద్రుడు ఏంటి చంద్రమ్మా ఇది మనపై సౌర్యమ్మకు అనుమానం వచ్చింది. మనం తప్పు చేస్తున్నామేమో చంద్రమ్మ అనడంతో వెంటనే అదేం లేదులే గండ నువ్వు మౌనంగా ఉండు అని ఇంద్రుడికి ధైర్యం చెబుతుంది చంద్రమ్మ.

Advertisement

మరొకవైపు దీప గుడిలో దీపాలు వెలిగిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ మోనిత, పనిచేసే అమ్మాయిలు వస్తారు. అప్పుడు మోనిత పౌర్ణమి గురించి భార్యాభర్తల గురించి చెబుతూ ఉండగా కార్తీక్ మాత్రం వినిపించుకోకుండా దీప కోసం గుడి మొత్తం వెతుకుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు మోనిత విన్నావా కార్తీక్ అనడంతో నువ్వు ఏం చెప్పావు మోనిత అని అంటాడు. ఆ తర్వాత మోనిత థాంక్స్ కార్తీక్ అంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు.

అప్పుడు మీ సార్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆ అమ్మాయిని అడగడంతో ఇప్పుడే అటువైపు వెళ్ళాడు మేడం అనగా సరే మీరు వెళ్ళండి నేను వెళ్లి వెతుకుతాను అని అంటుంది మోనిత. మరొకవైపు కార్తీకదీపం గుడి మొత్తం వెతుకుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మౌనిత వచ్చి ఏమైపోయావు కార్తీక్ ఎవరికోసం వెతుకుతున్నావు అనడంతో గుడి చూస్తున్నాను మోనిత అనగా నాతో పాటు ఉండి కూడా నువ్వు గుడి చూడొచ్చు కార్తీక్ అని అంటుంది.

అప్పుడు అవన్నీ నాకు తెలియదు కార్తీక్ నువ్వు నాతో పాటు కార్తీకదీపం వెలిగించాల్సిందే అనడంతో వెంటనే కార్తీక్ కామెడీగా మాట్లాడుతూ చూడు మోనిత గుడి నిండా ఆడవాళ్ళే ఉన్నారు వారు భర్తలు ఎవరు రాలేదు అని అంటాడు. అవునా సరే అలా అయితే అని కార్తీక్ తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ఇక చూపు నీ దగ్గరే ఉంచుకొని నీ పక్కనే ఉన్నాను అన్న అనుభూతి కలుగుతుంది అని మోనిత కు కర్చీఫ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ వెళ్లే దీపతో దీపాలు కలిసి వెలిగిస్తూ ఉండగా అది చూసిన మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

నాకు ఈ కర్చీప్ నువ్వు వెళ్లి ఆ దీపతో వెలిగిస్తావా ఆ దీపాన్ని ఎలా అయినా ఆర్పేస్తాను నీ అంత చూస్తాను అని మోనిత కోప్పడుతూ ఉండగా ఇంతలో శివలత అక్కడికి వచ్చి మోనిత ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్తుంది. అప్పుడు కార్తీకదీపం ఇద్దరూ మళ్లీ నాగుల కట్ట దీపాలు వెలిగించడానికి వెళ్తూ ఉండగా అప్పుడు దీపా అనుకోకుండా కింద పడిపోతూ ఉండటంతో కార్తీక్ దీపాన్ని పట్టుకొని అలాగే ఒకరి వైపు ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. అది చూసిన మోనిత మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

అప్పుడు శివలత మేడం వారి పని తర్వాత చెబుదురు ఇది గుడి మేడం అని అనడంతో ఇది గుడి అన్న సంగతి వాళ్ళ గుర్తు ఉందా శివలత అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత తనదేమీ తప్పులేదు దీపదే తప్పు అన్నట్టుగా శివలత లేనిపోని అబద్ధాలు అన్నీ చెబుతూ ఉంటుంది. అప్పుడు శివలత మేడం నేను కూడా చూస్తున్నాను మీ దగ్గర లేనిదేంటి ఆ వంటల దగ్గర ఉన్నది ఏంటి సార్ ఎందుకు ఆ వంటలక్క వెంటపడుతున్నాడు అని ఉంటుంది.

మరొకవైపు దీప నేను మీకు భార్యని అని గుర్తు లేకపోయినా మీరు నాతో కలిసి దీపాలు వెలిగించారు. అలాగే ఆ దేవుడు దయవల్ల నీకు గతం గుర్తుకు వస్తే మేలు డాక్టర్ బాబు అని దీప మొక్కుకుంటూ ఉండగా పక్కనే కార్తీక్ కూడా దేవుడిని మొక్కుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దీప మరొకవైపు మోనిత ఇద్దరు కార్తీక దీపాలను వదలడానికి వెళ్తారు. అప్పుడు మోనిత ఆరనీకుమా ఈ దీపం కాదే ఈరోజు నీ దీపం ఆరిపోతుంది అంటూ దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నిన్ను లేదా కార్తీక్ ఇద్దరు ఎవరు చంపేస్తాను అని దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మోనిత.

Advertisement

అప్పుడు దీప ఆరోపోయేది దీపం నా కాదే నీ దీపం ఆరిపోతుంది. నువ్వే చూసావు కదా ఈ గుడిలో నీ ముందే నువ్వు చూస్తుండగానే కార్తీక్ బాబు నాతో కలిసి దీపాలు వెలిగించేలా చేశాడు ఆ దేవుడు అని మోనిత తగిన విధంగా బుద్ధి చెబుతుంది దీప. ఇప్పుడు మోనిత నాకు దక్కనిది మరెవరికి దక్కనివ్వను. అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ మోనిత అని దీప అనగానే నిజమే మాట్లాడుతున్నాను నువ్వు కాదు కార్తీక్ కూడా తప్పు చేశాడు అని అంటుంది.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel