Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి జరిగిన విషయం తెలుసుకొని వసు కోసం రోడ్డుపైన ఎదురుచూస్తూ కావాలనే వసుతో గొడవ పెట్టుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి వసుని కొట్టబోతుండగా అప్పుడు వసు ఇలా చేయి చేసుకోవడాలు, నోరు పారేసుకోవటం కాదు ఆరోగ్యానికి హానికరం అని అంటుంది. అప్పుడు సాక్షి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసుధార సాక్షికి గట్టిగా బుద్ధి చెబుతుంది. అయిన అలాంటి పనులు చేసి రిషి సార్ కి దగ్గర అవుదాం అని ఎలా అనుకున్నావు అంటూ సాక్షి కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
మరొకవైపు రిషి కాలేజ్ లో జరిగిన విషయం గురించి కోప్పడుతూ దేవయానితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సాక్షి మధ్యలో మాట్లాడడంతో నువ్వు మాట్లాడకు అంటూ సాక్షి నోరు మూయిస్తాడు రిషి. అప్పుడు సాక్షితో మాట్లాడుతూ నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు.
ఆరోజు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఏమీ అనలేదు కానీ నువ్వే వద్దు అనుకుని వెళ్లావు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత దేవయాని ఫ్యామిలీ లో అందరూ ఒక్కొక్కరు ఒక మాట అనడం తో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
కాని దేవయాని అని మాత్రం సాక్షి ని మరింత రెచ్చగొడుతుంది. ఆ తర్వాత వసు, ఫోన్ లో రిషి ఫోటో చూస్తే కాలేజీలో సాక్షి చేసిన హంగామా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. రిషి కూడా వసుధార గురించి ఆలోచిస్తూ బస్సు జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని వసుధార ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగానే వసు ఫోన్ చేస్తుంది.
మరొకవైపు వసు దగ్గరికి పిల్లలు వచ్చి కథ చెప్పమని అడుగుతారు. ఇంతలోనే ఒక పిల్లవాడు అనుకోకుండా రిషి కి ఫోన్ చేయడంతో ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. కానీ రిషి కాల్ లో ఉన్నాడు అన్న విషయం తెలియక వసు రిషి గురించి పిల్లలకు కథలు చెబుతూ ఉంటుంది. అది ఫోన్ లో రిషి విని కాల్ కట్ చేస్తాడు.
మరుసటి రోజు వసు కోసం రిషి వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోనే వసుధార అక్కడికి వస్తుంది. అప్పుడు రిషీ మాట్లాడుతూ ఏంటి నువ్వు నా గురించి పిల్లలకు కథలు కథలుగా చెప్తున్నావ్ అని అనడంతో అప్పుడు వసుధార మాట్లాడిన తీరు చూసి రిషి ఆశ్చర్యపోతాడు.
రేపటి ఎపిసోడ్ లో రిషి, వసు పై తీవ్ర స్థాయిలో మండిపడతాడు. నేను నీకు ప్రపోజ్ చేసిన విషయం సాక్షి కి ఎందుకు చెప్పావ్ అంటూ విరుచుకు పడతాడు. నేను ఒక రిజెక్ట్డ్ పీస్ అంటూ వసు కి చేతులు జోడించి దండం పెడతాడు. అప్పుడు వసు ఎమోషనల్ అవుతుంది.
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.