Anushka shetty: అర్జున్ రెడ్డి సినిమాతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల గుండెల్లో తిష్ట వేస్కొని కూర్చున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇతడు తాజాగా లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం కూడా అందిరికీ తెలిసిందే. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. అందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను షేర్ చేశారు. విజయ్ న్యూడ్ గా ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఎర్ర గులాబీలను అడ్డుగా పెట్టుకొని నగ్నంగా ఉన్న ఈ ఫొటోపై స్టార్ హీరోయిన్లు స్పందిస్తున్నారు. నటి అనుష్క స్పందిస్తూ… చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
పూరి జగన్నాథ్ నుంచి ఇలాంటి మ్యాజిక్ లు మున్ముందు చాలా చూడాలనుకుంటున్నాను అని.. విజయ్ ది బెస్ట్ అంటూ స్వీటీ కామెంట్లు చేసింది. అలాగే విజయ్ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాడని.. చార్మీ ఇంకా ఎన్నెన్నో కథలు చెప్పాలని.. కరణ్ జోహార్ కొత్త కథలను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాంరంటూ అనుష్క రాసుకొచ్చింది. చివరగా లైగర్ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
AdvertisementView this post on Instagram
Advertisement