Pension scheme: వృద్ధాప్యంలో లభించే పెన్షన్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ చాలా పాపులర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ స్కీంలో చేరే వారికి వృద్ధాప్యంలో 1000 రూపాయల నుంచి 5000 వరకు వస్తుంది. ఈ పెన్షన్ పొందాలంటే స్కీమ్లో చేరిన నాటి నుంచి ప్రతీ నెలా కొంత మొత్తం జమ చేయాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ లభిస్తుంది. ఈ పాపులర్ స్కీంలో 2021-2022 ఆర్థిక సంవత్సరంలోనే 99 లక్షల మంది చేరారు. అంటే సుమారు కోటి మంది వరకూ ఈ స్కీంలో డబ్బులు కడుతున్నారు. 2022 మార్చి నాటికి ఈ స్కీంలో చేరిన వారి సంఖ్య 4.01 కోట్లకు చేరింది.
చిన్న వయసు నుంచే రిటైర్ మెంట్ ఫండ్ పై దృష్టి పెట్టానుకునే వారికి అటల్ పెన్షన్ యోజన అందుబాటులో ఉంది. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరితే మిగతా వయసుల కన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవ్చచు. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగే ఈ పథకానికి 18 నుంచి 40 ఏల్ల వారు అర్హులు. 18 ఏళ్లు ఉన్న వారు ఈ పథకంలో చేరితే 42 ఏళ్ల పాటు ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలి. అలాగే 40 సంవత్సరాలు ఉన్న వారు మరో 20 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఖాతాదారుల వయసు ఏదైనా వారికి 60 ఏళ్లు వచ్చే దాకా ప్రీమియం చెల్లింపులు కొనసాగుతాయి.