Devatha serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రాధ,ఆదిత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రాధ,ఆదిత్య డాక్టర్ యాక్సిడెంట్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాధ డాక్టర్ కి ఏమైంది అని అడగగా తెలియదు అని చెబుతాడు ఆదిత్య. అప్పుడు జానకమ్మ పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఆదిత్య నాకు తెలిసిన ఒక ప్రకృతి వైద్యశాల ఉంది.
అక్కడికి వెళ్లి వైద్యం చేపిస్తే నయమవుతుంది అని అనడంతో రాధ సరే అని అంటుంది. మరొకవైపు సత్య జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి సత్య నువ్వు ప్రతి ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు మీ ఇద్దరూ కలిసి రెండు రోజులు బయటకు వెళ్లి తిరిగి రండి అప్పుడు మీ ఇద్దరి మనుషులు కలుస్తాయి అందుకు ఆదిత్యను నేను ఒప్పిస్తాను అని అనడంతో సత్య సరే అని అంటుంది.
దేవత సీరియల్ అక్టోబర్ 3 ఈరోజు ఎపిసోడ్ : ఆదిత్యపై కోపడిన దేవుడమ్మ..
మరొకవైపు జానకమ్మ దగ్గర దేవి, చిన్మయి ఆడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి రాధ, ఆదిత్య రావడం చూసి మాధవ కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య అసలు విషయం చెప్పడంతో అందరూ సంతోషపడతారు. అప్పుడు రామ్మూర్తి సరే బాబు మీరు ఎక్కడికంటే ఎక్కడికి తీసుకొని వెళ్దాము జానకికి నయం అవడం ముఖ్యమని అంటాడు.
అప్పుడు మాధవ, దేవి వాళ్ళు అందరూ కలిసి ఆదిత్య ను రమ్మని పిలుస్తారు. మరొకవైపు సత్య దేవుడమ్మ చెప్పిన మాటలు తలుచుకొని సంతోష పడుతూ ఉంటుంది. ఆదిత్యతో బాగా సమయం గడపాలి అని సంతోషంగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. మరొకవైపు మాధవ గిటార్ వాయిస్తూ నువ్వు రాత జోలికి వస్తేనే ఊరుకోలేదు అలాంటిది మా అమ్మ జోలికి వస్తే ఎలా ఊరుకుంటానో అనుకొని సంతోషంగా గిర్రర్ వాయిస్తూ ఉంటాడు.
మాధవ మాటలు బట్టి చూస్తే ఆదిత్య మీద ఏదో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆదిత్య ఇంటికి వెళ్లడంతో ఫ్లైట్ టైం అవుతుంది పెళ్ళాం పదా ఆదిత్య అని అంటుంది సత్య. ఎక్కడికి అనే ఆదిత్య అడగడంతో దేవుడమ్మ వచ్చి నీకోసం సత్య కోసం పాండిచ్చేరి వెళ్లడానికి టికెట్లు బుక్ చేశాను అని అంటుంది దేవుడమ్మ. అప్పుడు ఆదిత్య వాళ్ల మీద కోపంతో అరుస్తాడు. దాంతో దేవుడమ్మ ఎప్పుడు ఆఫీసేనా అంటూ ఆదిత్య పై కోప్పడుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World