Viral Video: పెళ్లి మండపంలోకి డాన్స్ చేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన వధువు… వీడియో వైరల్!

Updated on: January 27, 2023

Viral Video : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. ఇంత ముఖ్యమైన ఈ వేడుక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లిలో వధూవరుల కుటుంబసభ్యులు బంధుమిత్రులు అద్భుతంగా డాన్సులు చేస్తూ అందరినీ సందడి చేసే వారు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్లి మండపంలోకి వధూవరులిద్దరు కలిసి డాన్స్ లు చేస్తూ మండపంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

the-bride-danced-and-enter-the-wedding-hall-video-goes-viral
the-bride-danced-and-enter-the-wedding-hall-video-goes-viral

తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రైడల్ లెహంగా డిజైన్ అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇందులో వధువు ఎంతో చక్కగా ముస్తాబయి కళ్ళజోడు పెట్టుకొని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్ నటించిన సలామ్ ఇ ఇష్క్ పాటకు డ్యాన్స్ చేసింది. ఇలా ఈ పాటకు డాన్స్ చేస్తూ ఎంతో ఘనంగా మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ విధంగా వధువు డాన్స్ చేస్తూ ఉండగా తన పక్కనే ఉన్న మరొక అమ్మాయి కూడా వధువుతో కలిసి డాన్స్ చేస్తూ వచ్చారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Bridal lehenga (@bridal_lehenga_designn)

Advertisement

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఈ వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. అయితే ఇటువంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో చక్కర్లు కొడుతూ ఉన్నాయి.అయితే ఈ వీడియోలో పెళ్లికూతురు ఎంచక్కా సన్ గ్లాసెస్ ధరించి ఎంతో విభిన్నంగా మండపంలోకి ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Read Also : Saami Saami song : ఏడు పదుల వయసులో కూడా సామి.. సామి అంటూ రష్మికను మించిపోయి డాన్స్ చేసిన బామ్మ .. వీడియో వైరల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel