Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు..వంటలక్కని దీప అని పిలిచిన కార్తీక్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇ

By Ramesh Babu

Published on: September 26, 2022 9:06 AM

Updated on: September 26, 2022 9:06 AM

Sourya gets worried as Soundarya enquires about her iin todays karthika deepam serial episode

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప ఎలా అయినా కార్తీక్ గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దీప కాలనీ అసోసియేషన్ వార్షికోత్సవం వంట చేయడానికి వెళ్ళగా అక్కడ వాళ్ళందరూ నాటకాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు దీప అక్కడికి వెళ్లడంతో నీ కోసమే ఎదురు చూస్తున్నాము వంటలు వెనకాల చేయాలి అక్కడికి వెళ్ళు అని అనడంతో సరే అని అక్కడికి వెళుతూ ఉంటుంది దీప. అప్పుడు వాళ్ళు ఏ నాటకం వేద్దాము అని ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న దీప నా దగ్గర ఒక కథ ఉంది అని చెప్పి వాళ్లకు ఆ కథను వినిపిస్తుంది.

Advertisement

Sourya gets worried as Soundarya enquires about her iin todays karthika deepam serial episode

అందరూ ఆ కథ చేయడానికి ఒప్పుకుంటారు. ఆ కథలో దీప పాత్రను దీపనే చేయమని చెబుతారు వాళ్ళు. మరొకవైపు మోనిత డాక్టర్ దగ్గరికి వెళ్లి కార్తీక్ అంటే తనకు ఎవరో తెలియని విధంగా డాక్టర్ కు కార్తీక్ గురించి వివరించి కొన్ని డౌట్స్ అడిగే క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మోనిత గతంలో జరిగిన సంఘటనలు ఆ వస్తువులు మనుషులు చూస్తే గతం గుర్తుకు రావచ్చా డాక్టర్ అని అడగగా కచ్చితంగా చెప్పలేని మేడం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

మరొకవైపు శౌర్య,హిమ ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు సౌర్య హ్యూమన్ వెళ్ళిపో హిమ అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. అప్పుడు ఎక్కడికి వచ్చి సౌర్యాహిమల ఫోటోల చూపించి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడగగా అటువైపు ఉన్నారు అని చూపించడంతో సౌందర్య అక్కడికి వెళుతుంది. ఇంతలోనే సౌందర్య,సౌర్య ని చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక సౌందర్య అక్కడికీ రావడంతో హిమ ఎమోషనల్ అవుతుంది. సౌర్య ఎక్కడికి వెళ్ళింది అనడంతో ఇప్పుడే వస్తానని వెళ్ళింది నానమ్మ అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు చాలా సేపు ఎదురుచూసిన కూడా శౌర్య రాదు. అక్కడే మోనిత కారు ఉండడంతో మోనిత కారు డిక్కీలో వెళ్లి కూర్చుంటుంది సౌర్య. మరొకవైపు దీప కార్తీక్ కోసం ఇంటికి వెళ్లగా అప్పుడు కార్తీక్ కసురుకుంటూ చిరాకుగా మాట్లాడుతుంటాడు.

Advertisement

అప్పుడు మన కాలనీ అసోసియేషన్ వారు నాటకం వేస్తున్నారు మీరు అక్కడికి వస్తే నా భర్త ఎవరో తెలుస్తుంది అని దీప చెప్పడంతో నిజంగా తెలుస్తుందా అని అడుగుతాడు కార్తీక్. అవును తెలుస్తుంది అనటంతో కార్తీక్ సరిపదా అని దీపతో అంటాడు. అప్పుడు శివ అక్కడే ఉండగా మీ మేడం వస్తే నేను దీపతో కలిసి నాటకం చూడ్డానికి వెళ్లాను అని చెప్పు అని అంటాడు. ఆ తర్వాత దీప కార్తిక్ ఇద్దరు కలిసి నాటకం వేసి చోటికి వెళ్తారు. ఆ తర్వాత మోనిత బయటకు వచ్చి కారు వేసుకుని వెళుతుంది.

కారు డిక్కీ లో ఉన్న సౌర్య ఈ కారు ఎక్కడికి వెళ్తుందో ఏమో అని భయం భయంగా ఉంటుంది. అప్పుడు మోనిత ఎలా అయినా దీప నుంచి కార్తీక్ ని దూరంగా ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు నాటకం జరిగే చోటకి దీప వాళ్ళ అన్నయ్య రావడంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఇంకా ఇంత సేపు పడుతుంది నాకు బోరింగ్ గా ఉంది వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు కార్తీక్ ని దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఇద్దరు కలిసి ఒప్పించి అక్కడికి తీసుకుని వెళ్తారు.

రేపటి ఎపిసోడ్ లో నాటకం మొదలవుతుంది. అప్పుడు గతంలో జరిగిన సంఘటనలు స్టేజి మీద జరుగుతూ ఉండడంతో అవి చూసి కార్తీక్ తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు దీప ఇల్లు విడిచి వెళ్లిపోయేటప్పుడు చెప్పిన డైలాగులు చెప్పడంతో గతాన్ని మరింత గుర్తు తెచ్చుకుంటాడు కార్తీక్. అప్పుడు దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కార్తీక్ లేచి దీప దీప వెళ్ళకు అని గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో దీప టెన్షన్ పడుతూ డాక్టర్ బాబు అని అరుస్తుంది.

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :