Karthika Deepam March 7th Today Episode : చివరి రోజు అన్న కార్తీక్ .. బోరున ఏడ్చేసిన సౌందర్య..?

Updated on: March 7, 2022

Karthika Deepam March 7th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. గుడిలో పూజారి సౌందర్య, ఆనందరావు లకు వెంటనే మీ కొడుకు కోడలు అని వెనక్కి వచ్చే మని చెప్పండి అని చెప్తాడు. ఇక సౌందర్య, ఆనందరావు పూజారి చెప్పిన మాటలకు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మరొకవైపు మోనిత తుపాకి పట్టుకొని ఎలా అయినా సరే కార్తీక్,దీప లను చంపాలి అని ప్లానింగ్ వేస్తూ ఉంటుంది. ఇక మోనితను చూసిన పనిమనిషి అమ్మ ఎందుకు గన్ను తీసుకున్నారు అని అడగగా వెళ్లి తీసుకురా అని అంటుంది.

మరోవైపు కార్తీక్, దీప లు పిల్లలతో కలసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక దీప పెళ్లయిన మొదట్లో హనీమూన్ కి వెళ్ళిన ప్లేస్ ని చూసి అని ఒకసారి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. అదేవిధంగా విహారి తో కలసి అక్కడ గడిపిన క్షణాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జీవితం ఎంత విచిత్రమైనది. ఇక్కడ వెన్నెల రాత్రులు, అమావాస్య చీకట్లు అంటూ వాటిని గుర్తు చేసుకుంటుంది.

మరోవైపు కార్తీక్ పిల్లలను చూసి ముచ్చట పడుతూ ఉంటాడు. అప్పుడు దీప వైపు చూసి వారి దీప చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.. నాకు నువ్వు రత్నం లాంటి పిల్లలను ఇచ్చావు కానీ అప్పుడు ఎందుకు ఆ విధంగా ఆలోచించానో అని బాధపడ్డాడు. అప్పుడు దీపా కూడ ఎమోషనల్ అవుతుంది.

Advertisement
Karthika Deepam March 7th Today Episode
Karthika Deepam March 7th Today Episode

తర్వాత ఇంట్లో సౌందర్య దంపతులు, ఆదిత్య దంపతులు గుడిలో పూజారి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని తెలిసిన పడుతూ ఉంటారు. అప్పుడు ఆదిత్య అలా ఫీల్ అవ్వకు మమ్మీ.. పూజారి గారు జాగ్రత్తగా ఉండమని చెప్పారు అంతే అలాంటివి జరగవు భయపడకు అని చెబుతాడు.

మరొకవైపు డాక్టర్ బాబు తన పిల్లలతో కలిసి ఒక హోటల్లో దిగుతారు. పిల్లలు అక్కడి వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరొకవైపు దీప పెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ముచ్చట పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam March 5 Today Episode : ఆనందంలో వంటలక్క కుటుంబం..మోనిత ఏం చెయ్యనుంది..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel