Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వసు.. ఎమోషనల్ అవుతున్న రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో

By Ramesh Babu

Published on: April 29, 2022 8:10 AM

Updated on: April 29, 2022 8:10 AM

---Advertisement---

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో దేవయాని,వసు ని లేనిపోని మాటలు అని బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసు, జగతి లను టార్గెట్ చేసిన దేవయాని వారిద్దరినీ నానారకాలుగా మాటలు అంటూ వారిని బాధ పెడుతుంది. దేవయాని మాటలకు వసుధార లోలోపల కుమిలిపోతు ఉంటుంది. అప్పుడు పదే పదే నువ్వు ఏ అర్హతతో ఇంటికి వచ్చావు అంటూ నిలదీస్తుంది దేవయాని.

Advertisement

NOiLMTO0

ఇద్దరూ కలసి రిషి కీ ఉచ్చు బిగించాలి అని చూస్తున్నారా అని అనడంతో జగతి కోప్పడుతుంది. మీకు కష్టం వస్తే ఎన్నో హాస్టల్స్ ఉండగా నువ్వు మా ఇంటికి రావాలా అని అంటుంది. అంతేకాకుండా మీ బావ కూడా వచ్చాడు అంట కదా. ఆ బావ నువ్వే ఏర్పాటు చేసుకున్నావా అని అనడంతో జగతి కోపంతో విరుచుకు పడుతుంది.

ఇంతలో మెలుకువ వచ్చిన మహేంద్ర జగతి పక్కన లేకపోవడంతో వెతుకుతూ వసుధార రూమ్ వైపు వస్తాడు. అక్కడ దేవయాని,వసు, జగతి లు ఉండటం చూసి మహిళకు ఏం జరిగిందో అర్థం అవుతుంది. అప్పుడు వసు నేను ఇక్కడే ఉండి అందర్నీ బాధపెట్టాలి అని అనుకోవడం లేదు సార్ నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను అని అనడంతో జగతి మహేంద్ర లు బాధపడుతూ ఉంటారు.

ఇక మరుసటి రోజు ఉదయం దేవయాని హాల్లో కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర,జగతి రావడం చూసి ఈ ఇల్లు అన్నదాన సత్రం గా మారింది ఎవరెవరో వస్తున్నారు అని అనడంతో జగతి కోప్పడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వసు లగేజ్ తీసుకొని ఇంటి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధపడుతుంది.

Advertisement

అందరూ ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వసు వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళి పోతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన రిషి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో వెళ్ళిపోతున్నాను సార్ అని అంటుంది వసు. నేను చెప్పినా ఉండవా అని రిషి అడగగా నేను ఏ అర్హత ఉండాలి సార్ అని అనడంతో రిషి మౌనంగా ఉండిపోతాడు. దీంతో వసు ఇంటి నుంచి వెళ్ళి పోతూ ఉంటుంది. అప్పుడు రిషి,వసు ని చూసి బాధ పడుతూ ఉండగా ఇంతలో సాక్షి అనే ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.