Guppedantha Manasu Aug 24 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగతి..?

Updated on: August 24, 2022

Guppedantha Manasu Aug 24 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ దీక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో వసు,రిషి ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. వసుధార రిషి ఎంగేజ్మెంట్ రింగ్ ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మరొకవైపు రిషి,వసు ఇచ్చిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ జ్ఞాపకాల,జ్ఞాపకాలుగా కాకుండా లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉండు వసు అని అనుకుంటూ ఉంటాడు.

Rishi arranges a farewell party for his students in todays guppedantha manasu serial episode
Rishi arranges a farewell party for his students in todays guppedantha manasu serial episode

మరోవైపు జగతి దంపతులు కాలేజీకి బయలుదేరుతూ ఉండగా ఇంతలో దేవయాని వారిని ఆపి కాసేపు వెటకారంగా మాట్లాడుతుంది. ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది కదా అందులో కొంతమంది దూరమవుతారు. అందుకే స్వీట్లు చేయించాను అని అంటుంది. ఇందులోనే ధరణి అక్కడికి స్వీట్స్ తీసుకొని వస్తుంది.

ఆ తర్వాత దేవయాని జగతిని బాధ పెట్టాలని రిషి గురించి గురించి మాట్లాడుతూ బాధపెడుతుంది. ఇందులోనే రిషి అక్కడికి రావడంతో వెంటనే జగతి రిషి అని పిలిచి కాఫీ ఇస్తుంది. దాంతో ఒక్కసారిగా దేవయాని షాక్ అవుతుంది. ఆ తరువాత రిషికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవి అని జగతి దగ్గరికి వెళ్లి ధరణి అక్కయ్య గారికి స్ట్రాంగ్ గా కాఫీ ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

Guppedantha Manasu Aug 24 Today Episode : దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగతి..

మరొకవైపు రిషి కాలేజీలో ఫేర్వెల్ పార్టీ కోసం ఏర్పాట్లు అన్ని దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధర రిషితో మాట్లాడడానికి ప్రయత్నించగా రిషి మాత్రం పనుల్లో నిమగ్నం అవుతాడు. ఇంతలోనే మహేంద్ర అక్కడికి వచ్చి గౌతమ్ తో మాట్లాడి వారిద్దరికీ ప్రైవసీ కలిగించాలి అని ప్లాన్ చేసి అక్కడున్న స్టూడెంట్స్ అందరిని పిలుచుకొని వెళ్తారు.

ఆ తర్వాత వసు,రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ ఫేర్వెల్ పార్టీ అరేంజ్మెంట్స్ లో ఉండగా ఇంతలో అక్కడికి ఫణింద్ర వచ్చి రిషి ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు రిషి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉండగా పుష్ప పక్కన నిలబడిన వసు, రిషిని అలాగే చూస్తూ ఉంటుంది.

అప్పుడు జగతి మహేంద్ర తో మాట్లాడుతూ ఈరోజు వసు తన మనసులో మాట చెబుతుందేమో అని అంటుంది. ఆ తర్వాత ఆ ప్రోగ్రాం మొదలవడంతో రిషి స్టూడెంట్స్ గురించి, కాలేజీ గురించి గొప్పగా చెబుతాడు. మధ్య మధ్యలో వసుధారను ఉద్దేశించి కూడా మాట్లాడుతాడు. అదే విధంగా జగతి స్పీచ్ ఇచ్చి వసు ని మాట్లాడమని చెప్పి వసు ని వేదిక పైకి అసలు పిలుస్తుంది.

Advertisement

Read Also :  Guppedantha Manasu Aug 22 Today Episode : మనసులో మాటలు బయటపెట్టిన వసుధార.. ఆ మాటలు విన్న రిషి..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel