Malli Nindu Jabili Serial Aug 4 Today Episode : ప్రమాదం నుంచి అరవింద్‌ను కాపాడుకున్న మల్లి.. ఆ రాత్రి మల్లితోనే అరవింద్..!

Malli Nindu Jabili Serial Aug 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మల్లి అరవింద్ మీద కోపడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మల్లి అరవిందుతో బాబు గారు రేపటి నుంచి మీ జీవితం మొదలు కాబోతుంది. రేపటి నుంచి నా జీవితం ముగిసిపోతుంది. మీరు నన్ను ఏమన్నా నేను భరిస్తాను. కానీ నేను చేయని తప్పు కి నన్ను నిందిస్తే నేను ఒప్పుకోను అంటూ బాధపడుతుంది.

Malli saves Aravind during the commotions in the village. Later, Aravind has to stay over the night in Malli's place
Malli saves Aravind during the commotions in the village 

అప్పుడు అరవింద్ తన బ్యాగ్ తీసుకొని ఇప్పుడే మీ వాళ్ళకి మన విషయం చెప్తాను. ఇక అబద్ధాలు చెప్పి ఇక్కడే ఉండటం నావల్ల కాదు నేను ఇప్పుడే మా ఇంటికి వెళతాను అంటూ బయటికి వస్తాడు. ఇక నడుచుకుంటూ మల్లి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఇక అక్కడే పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ జరుగుతున్న కాల్పులను వీడియో తీస్తూ ఉంటాడు. ఇక మల్లి అక్కడికి వచ్చి అరవింద్‌ని ప్రమాదం నుండి కాపాడుతుంది. ఇక అరవింద్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. నా గురించి నేను చూసుకోగలను అంటాడు. అప్పుడు మల్లి మీ వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని నాతో పంపించారు.

మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా బయటకి పంపిస్తాను. నీకేమైనా జరిగితే మీ అమ్మ, నాన్న మాలిని అక్క పరిస్థితి ఏంటి అంటుంది. సరే ఇప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు అంటూ ఇద్దరు కలిసి అక్కడ నుండి వాళ్ల ఇంటికి వెళ్ళిపోతారు. మల్లి థాంక్స్ బాబు గారు నా మాట విని నాతో పాటు వచ్చినందుకు అంటుంది. నేను నా జీవితంలో బాబు గారు తో పడ్డ మాటలు ఎవరితో పడలేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అరవింద్ కూడా నేను నా జీవితంలో మల్లిని తిట్టిన అంతగా ఎవరిని తిట్టలేదు తను నా ముందుకు వస్తేనే నాకు కోపం వస్తుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు.

Advertisement
Malli saves Aravind during the commotions in the village. Later, Aravind has to stay over the night in Malli's place
Malli saves Aravind during the commotions in the village 

ఇక మల్లి కూడా బాబు గారికి ఎలాగైనా నా తప్పు ఏం లేదని చెప్పాలనీ అనుకుంటూ ఉంటుంది. ఇక మీరా ,మల్లి రేపు అత్తగారి ఇంటికి వెళ్తుంది అని అన్నీ సిద్ధం చేస్తుంది. ఇక మల్లి అక్కడికి వచ్చి అమ్మ నాకు నిద్ర పట్టడం లేదు తలకు మర్దన చేయి అంటుంది. నువ్వే చెప్పు నాకు తలకు మర్దనా చేసి ఎన్ని రోజులు అయింది అంటుంది. అప్పుడు మీరా నీకు తలకు మర్దన చేయగానే నిద్రపోతావు కానీ నువ్వు ఇప్పుడు అలా చెయ్యొద్దు నువ్వు వెంటనే బాబు గారి రూమ్ కి వెళ్లి అక్కడే పడుకోవాలి అంటుంది. అప్పుడు మల్లి తన మనసులో అమ్మ నేను ఇప్పుడు బాబు గారు రూమ్‌లో పడుకోలేను నాకు ఇప్పుడు ఇది తప్ప వేరే దారి దొరకడం లేదు అనుకుంటుంది. మీరా మల్లిని మీ అత్తగారి ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడుగుతుంది.

Malli Nindu Jabili Serial Aug 4 Today Episode : మల్లిని అరవింద్ వదిలివెళ్లాడని మీరాకు తెలుస్తుందా?

Malli saves Aravind during the commotions in the village. Later, Aravind has to stay over the night in Malli's place
Malli saves Aravind during the commotions in the village 

అప్పుడు మల్లి బాబు గారు, వాళ్ళ అమ్మ, నాన్న పెద్దమ్మ పెదనాన్న ఉంటారు. పెద్దమ్మ పెదనాన్న కి ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. అమ్మాయికి పెళ్లయి ఒక పాప ఉంది. ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అరవింద్ వాళ్ళ అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అచ్చం నీలాగే నేను బాధ పడినప్పుడు నా తల నిమురుతూ ఉంటుంది. నాకు ఓదార్పు చెబుతుంది. ఇక పెద్దమ్మ చూడడానికి కొబ్బరికాయల గట్టిగా ఉన్నా తన మనసు మాత్రం మెత్తగా ఉంటుంది. ఆమె కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇక వాళ్ళ పిల్లలు నన్ను సొంత చెల్లి లాగా చూసుకుంటారు. ఇక చిన్న పిల్లలతో నేను బాగా ఆడుకుంటాను.

పెదనాన్న గారికి సిగరెట్ తాగే అలవాటు ఉంటే నేనే మానిపించాను ఇక అందరూ నన్ను మెచ్చుకున్నారు. అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ అక్కడే నిద్రపోతుంది. ఇక లక్కీ శశాంక్ కోసం పార్కు లో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ తో అసలు శశాంక్ కి నేను ఏ కలర్ డ్రెస్ లో వస్తున్న అని ఎలా తెలుస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. మూడు రోజులు కూడా నేను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే అదే కలర్ కార్ వేసుకుని వచ్చాడు. శశాంక్ లో ఏదో మాయ ఉంది అంటుంది. అసలు నా నెంబర్ నాకు తెలియకుండా ఎలా తీసుకున్నాడు అతను రాగానే అడగాలి అని వాళ్ళ ఫ్రెండ్ తో అంటుంది. ఇక లక్కీకి శశాంక్ కాల్ చేస్తాడు.

Advertisement
Malli saves Aravind during the commotions in the village. Later, Aravind has to stay over the night in Malli's place
Malli saves Aravind during the commotions in the village 

ఇక అరవింద్ వెళ్లడానికి రెడీ అవుతాడు. అప్పుడు మల్లి బాబు గారు ఆగండి బయట గొడవలు కాల్పులతో గందరగోళంగా ఉంది. జాగ్రత్త అని చెబుతుంది అప్పుడు అరవింద్ నా గురించి నేను చూసుకోగలను అంటాడు. మిమ్మల్ని ఇక్కడే ఉంచాలి అని నేను అనుకోవడం లేదు నీకు జాగ్రత్త మాత్రమే చెబుతున్నాను అంటుంది మల్లి. బాపు మిమ్మల్ని లాడ్జిలో దింపడానికి మనుషులు పంపించాడు. మీరు వాళ్ళతో వెళ్ళండి అంటుంది. ఒక నిమిషం బాబు గారు వెంటనే వస్తాను అని చెప్పి మూలికలు తీసుకొని వస్తుంది. వాటిని అరవింద్ చేతికి ఇచ్చి బాబు గారు ఇంట్లో వాళ్లకి మూలికలు సిద్ధం చేశాను.

వీటి మీద ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్ళకి ఈ మూలికలు ఇవ్వండి. పింకీ పాప చక్కెర వ్యాధి కి, పెద్దమ్మ గారి బీపీ కి, పెద్దయ్య గారి ఆయాసాని కి, చిన్నయ్య గారి తలనొప్పి కి, అలాగే ఈ సింధూరం మాలిని అక్క కోసం అక్కకి అమ్మ వారి సింధూరం అంటే చాలా ఇష్టం అని చెప్పి అరవింద్ చేతికి ఇస్తుంది. అప్పుడు అరవింద్ ఇవన్నీ తీసుకెళ్లడానికి నా బ్యాగ్ లో కాళీ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లి నేను ఇంట్లో వాళ్ళకి సరిగా వెళ్లి వస్తాను అని కూడా చెప్పలేదు. వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలని ఇవన్నీ సిద్ధం చేశాను. పర్వాలేదు వాళ్ల ఆరోగ్యం బాగుండాలని నేను ఇక్కడ సీతారాములకి మొక్కుకుంటాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రేపు ఏం జరగబోతుందో చూడాలి.

Read Also : Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.. అరవింద్‌ చేసిన పనికి మల్లి ఆగ్రహం.. ఆ తర్వాత ఏమైందంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel