Devatha July 6 Today Episode : రుక్మిణి కోసం దెబ్బలు తిన్న సూరి.. బాధపడుతున్న ఆదిత్య..?

Updated on: July 6, 2022

Devatha July 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి, మా తర్వాత నన్ను కొత్త స్కూల్ లోకి జాయిన్ చేస్తాడు అని చెప్పడంతో రాధా షాక్ అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దేవి మాట్లాడుతూ అక్కని నన్ను నాయన పెద్ద స్కూల్లో వేస్తామని అన్నాడు అనడంతో వెంటనే చిన్మయి నువ్వు ఆ స్కూల్ కు వెళ్లు దేవి నేను ఈ స్కూల్ కి వెళ్తాను. ఎందుకంటే ఈ స్కూల్ దగ్గరే ఉంటుంది కాబట్టి అమ్మ మన వెంట వస్తుంది నేను అమ్మతో ఈ స్కూల్ కి వెళ్తాను. నువ్వు నాన్నతో ఆ స్కూల్ కి వెళ్ళు అనగా అప్పుడు రాదా నేను చెప్పే వరకు ఏ స్కూల్ కి వెళ్లదు అని అంటుంది.

Devatha July 6 Today Episode
Devatha July 6 Today Episode

ఆ తర్వాత సూరి ఎక్కడకు బండిపై వెళ్తూ ఉండగా ఇంతలో రుక్మిణి కనిపించడంతో, తను రుక్మిణి లాగా ఉంది అంటూ ఫాలో అవుతూ ఉంటాడు సూరి. ఇంతలో రామ్మూర్తి ఎవరో కోడలి వెంట పడుతున్నారని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రుక్మిణి సూరీని చూసి పరుగులు తీస్తుంది. ఆ తర్వాత రుక్మిణి కనిపించకుండా పోతుంది. ఇక రుక్మిణి ఫాలో అవుతున్నారు అనుకున్న సూరిని ఊరి జనాలు బాగా కొడతారు. అదంతా చాటుగా నుంచి చూస్తున్న చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సూరికి, రాజమ్మ వేడి నీళ్ల కాపురం పెడుతూ ఉండగా ఇంతలో దేవుడమ్మ, ఆదిత్య అక్కడికి వచ్చి ఏం జరిగింది అనడంతో జరిగిన విషయాన్ని చెప్పేస్తాడు సూరి.

Advertisement

అప్పుడు ఆదిత్య మీరు చూసింది రుక్మిణినే బాబాయ్ అని తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లలు ఇద్దరు కూర్చుని చదువుకుంటూ ఉంటారు. అప్పుడు దేవి చదివి ఈ చదువులన్నీ నావల్ల కాదు డైరెక్ట్ గా కలెక్ట్ చదువు చదువుతాను అని అనడంతో వెంటనే మాధవ ఎక్కడికి వచ్చి అలా చదవకూడదు అని చదువు గురించి చెబుతూ ఉండగా ఇంతలో రాధ పిల్లలను భోజనానికి పిలుస్తుంది. అప్పుడు దేవి నాయన చదువు గురించి బాగా చెప్పాడు అని రాధతో అనడంతో వెంటనే రాధ ఆయనకేం తెలుసు అదే ఆఫీసర్ సార్ కి అయితే అన్నీ తెలుసు ఆయన ద్వారా తెలుసుకో అని అంటుంది. అప్పుడు మాధవ కూడా వెటకారంగా మీ ఆఫీసర్ సార్ తోనే నేర్చుకో అని అంటాడు. మరొకవైపు ఆదిత్య కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో సత్య కాఫీ తీసుకుని వస్తుంది.

అప్పుడు సూరి కూడా అక్కడికి రావడంతో అలా ఎందుకు వెళ్లావు బాబాయ్ అని అడగగా వెంటనే అచ్చం రుక్మిణిలా కనిపించడంతో ఫాలో అయ్యాను అనడంతో ఆ మాటలు విని సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత రాధ
ఆదిత్య కి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. అలాగే మాధవతో కూడా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. అయితే వారి మాటలను తన ఫోన్ ద్వారా విన్న మాధవ వారిద్దరి ప్లాన్ లను పసిగట్టి మరిన్ని కొత్త కొత్త ప్లాన్లు వేసుకుంటాడు.

ఆ తర్వాత మాధవ వచ్చి తన చేతి పై పచ్చబొట్టు మార్కు పోవడంతో అప్పుడే దేవి వచ్చి పిలుస్తుంది. అప్పుడు మాధవ చేతి పై ఉన్న పచ్చబొట్టు మార్క్ పోవడంతో అప్పుడు దేవి చెయ్యి చాపమని అడుగుతుంది. అప్పుడు మాధవ, దేవి మాటలకు చెయ్యి చాప కుండ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. మరి రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Devatha: దేవి విషయంలో మరొక ప్లాన్ వేసిన మాధవ.. కోపంతో రగిలిపోతున్న రాధ..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel